వీఆర్‌ఎస్ ఇవ్వనందుకు ఏసీపీ మురారి మీద కోపంతో ఊగిపోతుంది కృష్ణ. అందుకే పెళ్లికి వెళ్లకుండా చంద్రశేఖర్‌ని తీసుకుని ఇంటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తండ్రిని పోలీసు పదవికి రాజీనామా చేయమని అడుగుతుంది. అందుకు చంద్రశేఖర్ ఒప్పుకోడు. మరోవైపు ముకుంద మురారి వస్తాడని నమ్మకంతో ఎదురు చూస్తుంటుంది. అక్కడ భవాని ముకుందని పెళ్లి ఇష్టం లేదా అంటూ నిలదీస్తుంది. ఆ తర్వాత నవంబర్ 29 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మేళతాళాలతో పెళ్లి మండపానికి వెళ్తుండగా ఆదర్శ్ పెళ్లి ఆపండిరా అంటూ అరుస్తాడు. ఎందుకు ఏమైంది అని అడగ్గా మురారి.. అంటాడు. రేపు వస్తాడని అందరూ ఆదర్శ్‌కి నచ్చచెప్తారు. అంతలోనే మురారి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తాడు. ఆదర్శ్, మురారిలు కలిసి ఆనందంతో డ్యాన్స్ చేస్తారు. అపుడే భవాని రావడంతో భయంతో సైలెంట్ అయిపోతారు కానీ ఇద్దరితో కలిసి భవాని కూడా స్టెప్పులు వేస్తుంది. ఆ తర్వాత ఆదర్శ్ తనకు కాబోయే భార్యను చూడమంటాడు. తను నాకు పర్‌ఫెక్ట్ జోడీ అని చెప్తేనే నేను తాళి కడతా అంటాడు ఆదర్శ్. సరేనంటూ వెళ్తాడు మురారి.
అక్కడ మురారిని తలుచుకుంటూ మెహిందీ వేయించుకుంటుంది ముకుంద. అంతలోనే గోపీ మురారి దగ్గరికి వచ్చి నెంబర్ కలిసిందా అని అడుగుతాడు. ఫోన్ కలవట్లేదని మురారి చెప్పగా గోపి కాల్ ట్రై చేస్తాడు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయరు. అంతలోనే ఆదర్శ్ వచ్చి అమ్మాయిని చూడమని బలవంతం చేస్తాడు. దాంతో మురారి పెళ్లికూతురు గది దగ్గరి వరకు వెళ్తాడు. అంతలోనే మురారి వాళ్ల అమ్మ వచ్చి తీసుకెళ్లి పోతుంది. ఆదర్శ్ సంగతి పక్కన పెట్టి నువ్ ప్రేమించిన అమ్మాయి సంగతి చెప్పమని అడుగుతుంది మురారిని వాల్లమ్మ. అదేం లేదమ్మా అంటూ తప్పించుకుని పోతాడు మురారి.. ఆ తర్వాత టూర్‌లో జరిగిందంతా చెప్తాడు. నాకు మా అమ్మ తర్వాత నాకు నచ్చిన అమ్మాయి తను అంటాడు మురారి. తనని పెళ్లికి పిలవాల్సిందని సూచిస్తుంది మురారికి వాళ్లమ్మ.
మురారి గొంతు విని బయటికి వస్తుంది ముకుంద. తనకోసం అంతా వెతుకుతుంది. మురారిని వాళ్లమ్మ లోపలికి తీసుకెళ్లిపోతుంది. ముకుందను ఎవరో అమ్మాయి వచ్చి బయపెడుతుంది. అపుడే భవాని చూసి నందు అంటూ బెదిరిస్తుంది. తను చిన్నపిల్లలా అరుస్తూ గోల చేస్తుంది. రేవతిని పిలిపించి తనని గదిలో పెట్టిస్తుంది భవాని. నువ్వేంటి ఇక్కడున్నావ్ అంటూ ముకుందని అడుగుతుంది భవాని. సారీ చెప్పడం ఇదే మొదటిసారి ఇదే ఆఖరి సారి కావాలంటుంది భవాని.
సీన్ కట్ చేస్తే.. భవాని పూజ చేస్తుండగా అందరూ దేవుడికి మొక్కుతారు. ఆదర్శ్ మాత్రం మురారిని అమ్మాయి గురించి అడుగుతాడు. అలా ఇద్దరూ సరదాగా పోట్లాడుకుంటారు. పెళ్లికూతురికి మన ఇంటి తరపున నగలు ఇవ్వడం మన ఆచారం కదా.. రేవతి నువ్ వెళ్లి ఇవ్వు అంటుంది భవాని. ఆదర్శ్ వచ్చి మురారి చేతుల మీదుగా పెళ్లికూతురికి నగలు ఇవ్వమని కోరతాడు తల్లిని. అలాగే అనుకుంటూ వెళ్తాడు మురారి. మరి ముకుంద ప్రియుడిని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో తరువాతి ఎపిసోడ్‌లో చూద్దాం..