Life Partner: భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది, అంతే కాదు జీవితంలో చాలా ఇస్తుంది. అయితే అప్పుడప్పుడు ఒకరికొకరు, ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకోవడం సహజం. అదేనండీ.. కోపాలు తాపాలు పడడం, అలకలు, గొడవలు. ఏ ప్రత్యేకమైన బంధంలోనైనా గొడవలు, మనస్పర్థలు సహజమే. చెప్పాలంటే అవి మనకు మంచి గుర్తులుగా మిగిలిపోతాయి.
అయితే అప్పుడప్పుడు జరిగే గొడవలను పెద్దగా చేసుకుని ఇబ్బంది పడేవారు కొందరైతే.. వెంటనే సర్దుకుని సర్దిచెప్పి ముద్దు మురిపాలు కురిపించి మళ్ళీ మాములుగా ఉండేది ఇంకొందరు. కొందరు భాగస్వామిని ఊరికే మాటలు అని, తర్వాత చిన్న సారీ చెప్పి చేతులు దులిపేసుకుంటారు. కానీ దీనివల్ల వారు మాములుగా ఉంటారనుకుంటే పొరపాటే.
“సారీ”తో పాటు ఇలా..
ఇక మనస్పర్థలు వచ్చినప్పుడు కేవలం సారీ చెప్పి వదిలేయకుండా.. వారికి ముద్దుగా, ప్రేమగా ఏమి జరిగిందో వివరించే ప్రయాతనమ్ చేయాలి. అలాగే ప్రేమగా సంజాయిషీ చెప్పాలి. ఓపికగా ఎదుటి వారిని అర్ధం చేసుకోవాలి. ప్రశాంతంగా, ప్రేమతో వారి మనసు గెలుచుకోవాలి. అప్పుడే గొడవను పెద్దది చేయకుండా ఓపికగా వినాలి. వారి అభిప్రాయాలను గౌరవించాలి.
కొందరు జీవిత భాగస్వామిని ఊరికే అవమానపరుస్తారు, కించపరుస్తారు. ఇది అసలు సరైన విధానం కాదు. ఎవరైనా తప్పును అంగీకరించే స్వభావం కలిగి ఉండాలి. నిజాయితీగా ఉండడం చాలా అవసరం. నిర్లక్ష్యం తగదు. ఏదైనా పెద్ద సమస్య అనిపిస్తే కూర్చుని మాట్లాడుకోవాలి. దూరాన్ని తగ్గించుకోవాలి. ఒకరిపై ఒకరు పరస్పర ప్రేమ గౌరవం కనబరుచుకోవాలి.