దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ వారసుడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యి రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే కొద్ది రోజుల నుంచి ఈ మూవీపై వివాదం నడుస్తుంది. సంక్రాంతి రేసులో తెలుగు సినిమాలు ఉన్న కారణంగా వారసుడు సినిమా వాయిదా వేయాలని నిర్మాతల మండలి డిమాండ్ చేస్తుంది. అయితే దీనిపై సీనియర్ నిర్మాతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఒక నిర్మాత తన సినిమాని ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలనేది అతని ఇష్టమని, దానిని కంట్రోల్ చేసే అధికారం ఎవరికి లేదని అంటున్నారు. ఇక తాజాగా ఈ వివాదంపై దిల్ రాజు కూడా రియాక్ట్ అయ్యాడు.
వారసుడు మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నా అని నేను ముందుగానే ఎనౌన్స్ చేసానని, నా తరువాత వాల్తేర్ వీరయ్య సంక్రాంతికి అని ఎనౌన్స్ చేశారు. దాని తర్వాత వీరసింహారెడ్డి ఎనౌన్స్మేంట్ వచ్చింది. న్యాయంగా నా సినిమాకి ఎక్కువ థియేటర్స్ దక్కాలి. అయితే నిర్మాతల మండలి నన్ను వాయిదా వేసుకోమని అంటున్నారు. వారసుడు మూవీకి పోటీగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు వస్తున్నాయి.
ఒకే బ్యానర్ నుంచి ఒకే రోజు రెండు సినిమాలు రావడం అనేది ఇప్పటి వరకు ఇండస్ట్రీ చరిత్రలో జరగలేదు. ఆ సినిమాల రిలీజ్ విషయంలో నిర్మాతలకి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే వారు కూడా వారసుడు కారణంగా ఇబ్బంది ఉందనే మాట చెప్పలేదు. ఆ సినిమా నిర్మాతలకి లేని ఇబ్బంది అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఎందుకు అంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తన సినిమా వాయిదా వేసుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా దిల్ రాజు తేల్చి చెప్పేశారు. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.