Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6.. రాజు ఈ వారం ఎలిమినేట్ అయిపోయి వెళ్లిపోయాడు. హౌస్‌కి వచ్చిన వాళ్లు చాలా మంది చెప్పారు. రాజు ఎక్కడున్నా రాజేనని. నిజమే.. ఆది నుంచి కూడా రాజ్ ఒక రాజులాగే ప్రవర్తించాడు. ఎప్పుడూ హూందాగానే వ్యవహరించాడు. తొలినాళ్లలో పెద్దగా మాట్లాడేవాడు కాదు. ఆ తరువాతి నుంచి మాత్రం కాస్త మాట్లాడటం మొదలు పెట్టాడు. తన కోసం తను బాగానే స్టాండ్ తీసుకునేవాడు. అంతేకాకుండా టాస్క్‌ల్లోనూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు.
హౌస్‌లో వ్యక్తిత్వంలో చెప్పాల్సి వస్తే.. బాలాదిత్య, రోహిత తర్వాత రాజ్ మాత్రమే ఉంటాడు. ఎవరితోనూ పెద్దగా గొడవల్లేకుండా చాలా చక్కగా వ్యవహరించాడు. ఇక చివరికి ఎలిమినేట్ అయి వెళ్లే ముందు కూడా హూందాగానే వ్యవహరించాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో ఫైమా గట్టెక్కితే.. రాజ్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. స్టేజ్ మీదకు వచ్చిన రాజ్.. పంచ్, హగ్స్ గేమ్‌లో భాగంగా ఫైమా, ఆది, రోహిత్, రేవంత్‌కు హగ్స్ ఇచ్చాడు. మిగిలిన వారికి పంచ్ ఇచ్చాడు. వెళ్లే ముందు తన తోటి కంటెస్టెంట్లకు విలువైన సూచనలు ఇచ్చాడు.
ఫైమా ఫన్ చేస్తే బాగుంటుందని సూచించాడు. ఆదిరెడ్డి తను మాట్లాడిందే వేదం అన్నట్టుగా చేస్తాడని.. రోహిత్ అవసరమైన సందర్భంలో స్టాండ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పాడు. ఇక రేవంత్‌ది చిన్నపిల్లాడి మెంటాలిటీ అని, అతడు కచ్చితంగా టైటిల్ కొడతాడని.. ఫిక్స్ అయిపొమ్మన్నాడు. శ్రీహాన్ అందరి దగ్గర ఓకే కానీ.. ఫ్రెండ్స్ తప్పులను మాత్రం గట్టిగా చెప్పడని వెల్లడించాడు. ఇక నామినేషన్‌లో సరైన పాయింట్స్ చెప్పాలని శ్రీసత్యకు.. ఇనయాను టాప్ 5లో చూడాలనుకుంటున్నానని.. కీర్తి అయితే హౌస్‌లో తనకెప్పుడు కనిపించలేదని చెప్పాడు. చివరకు హోస్ట్ నాగార్జున కూడా రాజు ఎక్కడున్నా రాజేనని చెప్పి పంపించేశారు.