Unstoppable2: టాలీవుడ్ లో తెర మీద మాస్ డైలాగులు చెప్పాలన్నా.. పంచ్ డైలాగులు పేల్చాలన్న అది బాలయ్య తర్వాతే ఎవరైనా. తెర మీద నందమూరి బాలయ్య డైలాగులు ఇరగదీస్తుంటే.. చూసే ప్రేక్షకులు ఆనందంతో ఊగిపోతారు. అంత భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న బాలయ్య హోస్ట్ గా చేస్తున్న టాక్ షో.. ‘అన్ స్టాపబుల్’.
ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ‘అన్ స్టాపబుల్’ పేరుతో చేసిన టాక్ షో హిట్ అవడంతో.. నిర్వాహకులు బాలయ్యతో మరో సీజన్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తో ప్లాన్ చేయడం.. అది భారీ హిట్ అవడం తెలిసిందే. తర్వాత గ్యాపులు గ్యాపులుగా పలువురు గెస్టులతో ఎపిసోడ్లు వస్తున్నాయి.
బాలయ్య ‘అన్ స్టాపబుల్2’ షోకి గతంలో వచ్చినంత క్రేజ్ ఇప్పుడు లేదు. బాలయ్య ఈ మధ్యన ప్రారంభించిన ‘అన్ స్టాపబుల్2’ షోకి వస్తున్న గెస్టుల మూలాన ఆ ఎపిసోడ్లు చూడాలన్న కోరిక తగ్గుతూ వస్తోంది. బాలయ్య ఎంత ఎనర్జిటిక్ గా ఉన్నా కానీ అవతల వ్యక్తుల వల్ల షోకు ఆదరణ తగ్గుతోంది.
Unstoppable2:
‘అన్ స్టాపబుల్2’ టాక్ షోకి వరుసగా పొలిటికల్ లీడర్లు క్యూ కట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. మొదటి ఎపిసోడ్ లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వస్తే.. ఈ మధ్యన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలు వచ్చారు. ఇలా వరుసగా పొలిటికల్ లీడర్ల ఎంట్రీతో ఈ టాక్ షోకి ఆదరణ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఇదే కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో టాక్ షోకి ఆదరణ కష్టమే అని నెటిజన్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు.