ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా హనుమాన్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సూపర్ హీరో చిత్రంగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. దీనికి కంటిన్యూ కూడా నెక్స్ట్ ఉంటుందని ముందుగానే అతను టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు. ఇండియన్ మైథాలజీలో ప్రధానంగా చెప్పుకొని హనుమాన్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని, అతనే ఈ మూవీలో సూపర్ హీరో పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇక ఈ మూవీ టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది. ఆదిపురుష్ కంటే వంద రెట్లు హనుమాన్ టీజర్ బాగుందనే టాక్ నార్త్ ఇండియా ఆడియన్స్ నుంచి కూడా వినిపిస్తుంది.
అలాగే ఈ మధ్యకాలంలో సౌత్ లో డివోషనల్ టచ్ తో వచ్చే సూపర్ నేచురల్ పవర్స్ కాన్సెప్ట్స్ కి మంచి గిరాకి ఉంటుంది. కార్తికేయ 2 తర్వాత దేశ వ్యాప్తంగా కాంతారా మూవీ అద్బుతమైన కలెక్షన్స్ సాధించడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమాన్ కి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ మూవీని కేవలం 12 కోట్ల బడ్జెట్ తోనే నిర్మించారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమాకి హిందీ డబ్బింగ్ ద్వారా ఏకంగా 10 కోట్ల ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హనుమాన్ హిందీ రైట్స్ కోసం అడుగుతున్నారని తెలుస్తుంది. అలాగే శాటిలైట్, ఒటీటీ రైట్స్ కోసం కూడా భారీగానే డబ్బులు ఇవ్వడానికి ముందుకోస్తున్నట్లు టాక్. ఈ మూవీ 90 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. కేవలం 12 కోట్లతో తెరకెక్కుతున్న సినిమాకి ఏకంగా 90 కోట్ల బిజినెస్ జరగడానికి కారణం ఈ మూవీ కాన్సెప్ట్ అని టాక్ వినిపిస్తుంది.