యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అదే సమయంలో ఆన్ లైన్ లో తనపై జరిగే ట్రోల్స్ మీద అదే స్థాయిలో రియాక్ట్ అయ్యి నెటిజన్ల తాట తీస్తుంది. ఎవరైనా తనని విమర్శిస్తే వెంటనే వారికి కౌంటర్ ఇస్తుంది. అనవసరం ఎవరైనా తనని టార్గెట్ చేస్తే వారి అంతు చూసే వరకు వదిలిపెట్టదు. గతంలో చాలా సందర్భాలలో తనని ట్రోల్ చేసే నెటిజన్లుకి డైరెక్ట్ గా అనసూయ వార్నింగ్. అయితే ఎప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ కంప్లైంట్ వరకు ఆమె వెళ్ళలేదు. అయితే ఈ మధ్యకాలంలో కొంత మంది శ్రుతిమించి తనపై తప్పుడు వార్తలు రాయడం, అసభ్యంగా దూషించడం, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం చేస్తున్నారు.
అయితే చాలా మంది హీరోయిన్స్ ఇలాంటి వాటిపై పెద్దగా రియాక్ట్ కావడం లేదు. కాని అనసూయ మాత్రం ఈ విషయాన్ని కాస్తా సీరియస్ గా తీసుకుంది. తన ఫోటోలని మార్ఫింగ్ చేసి తప్పుడు రాతలు రాస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఓ వ్యక్తి మీద ఈ నెల 17న ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీనిపై ఎంక్వయిరీ చేసిన పోలీసులు కోనసీమ జిల్లాకి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజుగా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఇతను ట్విట్టర్ ఏకంగా 267 ఫేక్ ప్రొఫైల్స్ నడుపుతున్నాడని పోలీసులు గుర్తించారు. కేవలం అనసూయ ఫోటోలు మాత్రమే కాకుండా చాలా మంది హీరోయిన్స్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటాడని గుర్తించారు. ఈ నేపధ్యంలో అతనిపై పలు `సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేశారు. గతంలో దుబాయ్ లో ప్లంబింగ్ పని చేసే ఇతను ఇండియా వచ్చాక సొంత ఊరిలో ఉంటూ ఇలాంటి తప్పుడు పనులకి పాల్పడుతున్నాడని గుర్తించారు.