టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రెటీలని లక్ష్యంగా చాలా కథనాలు ప్రసారం అవుతున్నాయి. వారి వ్యక్తిగత జీవితాలని లక్ష్యంగా చేసుకొని కథనాలు వండివార్చుతున్నారు. ఇలాంటి వార్తల వలన వారి ఇమేజ్ డ్యామేజ్ చేసేప్రయత్నం జరుగుతుందని టాక్ ఉంది. మంచు మోహన్ బాబు ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకొని కొన్ని యుట్యూబ్ చానల్స్ మీమ్స్ తో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నాయి. వారు మీడియా ముందుకి వచ్చి ఏం మాట్లాడిన దానిని బూతద్దంలో చూపించి వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ బ్లేమ్ చేస్తున్నారు. దీనిపై మంచు విష్ణు ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. సైబర్ క్రైమ్ ని ఆశ్రయించారు.
ఇదిలా ఉంటే సీనియర్ యాక్టర్ నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ గత కొంతకాలంగా లివింగ్ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వారే అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. అయితే వీరిద్దరిని లక్ష్యంగా చేసుకొని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. అయితే ఈ కథనాలు రోజురోజుకి శృతి మించి ఉంటున్నాయి అనేది వారి ఫీలింగ్. రీసెంట్ గా కృష్ణ మృతి సమయంలో నరేష్, పవిత్ర లోకేష్ హడావిడి ఎక్కువ అయ్యిందనే టాక్ వినిపించింది. వీరు చేసిన హడావిడిపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నట్లు కథనాలు ప్రసారం అయ్యాయి.
అయితే అది ఎంత వరకు వాస్తవం అనేది తెలియదు. ఇప్పుడు పవిత్ర లోకేష్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. సోషల్ మీడియా, వెబ్ సైట్స్, కొన్ని చానల్స్ అదే పనిగా తన వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని, అలాగే ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమపై జరుగుతున్న ఈ సైబర్ ఎటాక్ నుంచి రక్షణ కల్పించాలని పవిత్ర లోకేష్ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వయిరీ చేయడానికి రెడీ అయ్యారు.