Pavithra Lokesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్న జంట నరేష్, పవిత్రా లోకేశ్ లు. ఈ మధ్య మైసూరులోని ఓ హోటల్ లో కలిసి ఉన్న నరేష్, పవిత్రా లోకేశ్ లను నరేష్ భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, నరేష్ ని ఏకంగా చెప్పుతో కొట్టడంతో వీరిద్దరి గురించి అందరూ చర్చించడం మొదలుపెట్టారు.
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి చెందిన నరేష్ తెలుగులో పలు సినిమాలు చేస్తుండగా.. మలయాళ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన పవిత్రా లోకేశ్ చాలా సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు సొంతం చేసుకుంది. అయితే వీరిద్దరు కలిసి ఉండటం, దానిపై వివాదం రేగడంతో వీరి గురించి పలు వార్తలు వచ్చాయి.
ఇక తాజాగా కృష్ణ అంతిమ సంస్కారాల్లో కూడా వీళ్లిద్దరు అతిగా చేశారనే టాక్ నడుస్తోంది. కాగా నరేష్ మరియు పవిత్రా లోకేశ్ ల గురించి కొన్ని వెబ్ సైట్లు మరియు యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. తాజాగా పవిత్రా లోకేశ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Pavithra Lokesh:
తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతకరంగా కామెంట్లు పెడుతున్నారని పవిత్రా లోకేశ్ సైబర్ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించింది. తనను, నరేష్ ను టార్గెట్ గా చేసుకొని చేస్తున్న ట్రోలింగ్ ను ఖండించిన ఆమె.. తప్పుడు, విష ప్రచారం చేస్తున్న వెబ్ సైట్లు మరియు యూట్యూబ్ ఛానల్స్ మీద చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.