Big Boss Inaya: తెలుగులో ఫైనల్ కు చేరువైన బిగ్ బాస్ సీజన్ 6లో ఇప్పుడు టాప్ లో కొనసాగుతున్న కంటెస్టెంట్ ఇనయ సుల్తానా. హీరోయిన్ అవ్వాలనే కోరికతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఇనయ.. ఆ మధ్యన ఆర్జీవీ పార్టీలో డ్యాన్స్ వీడియోతో పాపులర్ అయింది. ఇక బిగ్ బాస్ లో ఎక్కువ నోరు చేసుకునే కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇనయ.. ఇప్పుడు అన్ని రకాలుగా అదరగొడుతోంది.
దీంతో ఈసారి బిగ్ బాస్ టైటిల్ రేసులో ఇనయ సుల్తానా పేరు కూడా వినిపిస్తోంది. ఈమధ్యనే ఓ ఎపిసోడ్లో ఇనయ తల్లి బిగ్ బాస్ హౌజ్ లోకి రావడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం తెలిసిందే. చాలాకాలంగా తన కుటుంబ సభ్యులు ఎవరూ తనతో మాట్లాడటం లేదని ఇనయ బిగ్ బాస్ కి చెప్పగా.. ఇనయ తల్లి హౌజ్ లో ప్రత్యక్షం అవడంతో ఆమె ఎమోషనల్ అయింది.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నించి.. సరైన అవకాశాలు అందుకోని ఇనయ సుల్తానా ఇండస్ట్రీ గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ లోకి రాక ముందు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇనయ.. కాస్టింగ్ కౌచ్ అనేది అందరికి ఒకేలా ఉండదని చెప్పింది. కాస్టింగ్ కౌచ్ రకరకాలుగా ఎదురవుతుందని వివరించింది.
Big Boss Inaya:
తాను కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నట్లు తెలిపిన ఇనయ.. చాలామంది తనను ఆ పని కోసం అడిగారనిచ అవి చేసి ఉంటే ఇప్పుడు తాను హీరోయిన్ అయ్యే దానినని వివరించింది. ‘చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నా. అయినా సరే నాకు సంతృప్తి ఉంది. ఎలాంటి కమిట్‌మెంట్‌లు లేకుండా సినిమాలు చేసుకుంటున్నా.. నాకు హ్యాపీ ఉంది’ అని ఇనయ తెలిపింది.