మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కి కూడా రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. శ్రీలీల ఈ మూవీలో రవితేజకి జోడీగా నటిస్తుంది. పక్కా కమర్షియల్ కథాంశంతో మాస్ మసాల మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రసన్న కుమార్ ఈ మూవీకి కథ అందించాడు. ఇదిలా గత కొద్ది రోజులుగా రవితేజ వరుస సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. చివరిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాతో హిట్ కొట్టాడు. ఆ మూవీ తర్వాత వచ్చిన ఏ మూవీ కూడా సరైన హిట్ కాలేదు.
అయినా కూడా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ధమాకా సినిమా తర్వాత వాల్తేర్ వీరయ్య మూవీ రిలీజ్ కాబోతుంది. దాంతో పాటు టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతుంది. వీటితో పాటు రావణాసుర మూవీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ఉంది. ఇక వరుస ఫ్లాప్స్ ఉన్నా కూడా రవితేజ మార్కెట్ మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. తాజాగా ధమాకా మూవీకి జరిగిన బిజినెస్ బట్టి అతని మార్కెట్ రేంజ్ ఎలా ఉందో చెప్పొచ్చు.
ధమాకా హిందీ డబ్బింగ్ రైట్స్ 10 కోట్లకి అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. అలాగే డిజిటల్ శాటిలైట్ రైట్స్ 20 కోట్లకి ప్రముఖ ఒటీటీ చానల్స్ కొనుగోలు చేసిందని తెలుస్తుంది. ఇక థియేటర్ బిజినెస్ కూడా ఎక్కువగానే జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఇక డిజిటల్, శాటిలైట్, హిందీ రైట్స్ ద్వారా ధమాకా మూవీపై పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ తర్వాత రాబోతున్న రావణాసుర సినిమాపై కూడా మంచి బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది.