పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ కాంతారా. దేశ వ్యాప్తంగా ఏకంగా 400 కోట్ల కలెక్షన్స్ ని ఈ మూవీ సొంతం చేసుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో వరాహ రూపం అనే పాత ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సాంగ్ కూడా సినిమా సక్సెస్ లో కీలకంగా మారింది. క్లైమాక్స్ లో వచ్చే వరాహరూపం సాంగ్ కథ ఇంటెన్షన్ ని తారాస్థాయికి తీసుకెళ్తుంది. అయితే ఈ సాంగ్ పై కేరళలో ఒక బ్యాండ్ పార్టీ కోర్టులో పిటీషన్ వేసింది. వరాహరూపం సాంగ్ తన ట్యూన్ నుంచి కాపీ చేసారంటూ పేర్కొంది.
ఈ నేపధ్యంలో కేరళలోని కోర్టు కాంతారా టీంకినోటీసులు పంపించింది. ఇదిలా ఉంటే ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇక ఇందులో వరాహరూపం ఒరిజినల్ సాంగ్ లేకుండానే టెలికాస్ట్ చేశారు. దీంతో కాంతారా చిత్ర ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో వరాహరూపం సాంగ్ పై నడుస్తున్న కేసుని కేరళ కోర్టు కొట్టేసింది. కాపీ రైట్ పిటీషన్ లో ఎలాంటి వాస్తవం లేదని చెబుతూ పిటీషన్ ని కొట్టేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
ఈ నేపధ్యలో వరాహ రూపం సాంగ్ ని ఓటీటీలో చూడాలని ఆశించిన ప్రేక్షకులకి శుభవార్త లభించినట్లు అయ్యింది. అయితే దీనిపై ఉన్న కాపీ రైట్ పిటీషన్ ని కొట్టేసిన కూడా అంత వేగంగా అమెజాన్ లో చూసే అవకాశం రాకపోవచ్చు. ఎందుకంటే అమెజాన్ లాంటి ఇంటర్నేషనల్ డిజిటల్ మాధ్యమాలలో సినిమా ప్రసారం అయినప్పుడు కచ్చితంగా కాపీ నిబంధనలు పూర్తిగా క్లియర్ అయితేగాని టెలికాస్ట్ కాదు. అయితే వరాహ రూపం ఒరిజినల్ సాంగ్ ఇష్టపడే వారికి మాత్ర ఇది కచ్చితంగా శుభవార్త అని చెప్పాలి.