Tamannah Bhatia : ఆన్ స్క్రీన్‌లోనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ తన గ్లామర్ షో తో కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. గత కొంత కాలంగా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాలో హీట్‌ను పెంచుతోంది. రీసెంట్‌గా సినిమాల కౌంట్‌ను తగ్గించిన తమన్నా ఫ్యాషన్ దుస్తులతో అప్పుడప్పుడూ హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో హీట్ పెంచుతోంది. చీరకట్టు దగ్గరి నుంచి టైట్ ఫిట్ బాడీకాన్ దుస్తుల వరకు ఈ భామ సరికొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది.

Tamannah Bhatia : తమన్నా భాటియా నిజమైన ఫ్యాషన్ ఐకాన్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ భామ అనుసరించే ఫ్యాషన్ స్టైల్స్‌ను చూసి ఇట్టే ఆమె టేస్ట్ ఏమిటో చెప్పేయవచ్చు. గత కొంతకాలంగా రెడ్ కార్పెట్ లుక్స్‌తో అదరగొడుతున్న తమ్ము తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన బ్లాక్ కలర్ స్టేట్మెంట్ శారీ గౌన్ వేసుకుని అదరగొట్టింది ఈ చిన్నది.

ముంబైలో జరిగిన వోగ్ ఫోర్సెస్ ఆఫ్ ఫ్యాషన్ ఈవెంట్‌కు ఈ డిజైనర్ పీస్ తో హాజరై ఈవెంట్ కు మరింత కలర్‌ను అద్దింది.

ఎద పొంగులను చూపించేలా బ్లౌజ్ డిజైన్‌లో వచ్చిన ట్యూబ్ కార్సెట్ టాప్ గౌనును వేసుకుంది తమన్నా. భుజాల మీదుగా ట్రాన్స్పరెంట్ బ్లాక్ పల్లూను అందించారు. చిన్న చిన్న మెరుపుల అలంకరణలతో అవుట్‌ఫిట్‌ను మొత్తం క్లాసిక్ పీస్‌గా చెప్పుకోవచ్చు. ఈ అవుట్‌ఫిట్‌లో డ్రమాటిక్ లుక్‌లో కనిపించి తమన్నా ఫ్యాన్స్ మనసును దోచేసింది.

ఈ శారీ గౌన్‌కు తగ్గట్లుగా చెవులకు స్టడెడ్ ఇయర్ రింగ్స్, చేతి వేళ్లకు స్టేట్మెంట్ ఉంగరాలు పెట్టుకుంది. కనులకు షిమ్మరింగ్ ఐ లిడ్స్, మస్కరా, ఐ లైనర్ దిద్దుకుంది. పెదాలకు గ్లాసీ లిప్ షేడ్ పెట్టుకుని తన గ్లామరస్ మేకప్ లుక్స్‌తో అందరి చూపును తనవైపు తిప్పుకుంది.

తమన్నా భాటియా దుబాయ్‌లో జరిగిన ఫిల్మ్‌ఫేర్ మిడిల్ ఈస్ట్ అవార్డ్స్ 2022 కోసం డిజైనర్ టోనీ వార్డ్ డిజైన్ చేసిన గౌను వేసుకుని ఫ్యాషన్ ప్రియులను ఖుషీ చేసింది. డార్క్ కలర్ గౌనులో ర్యాప్ వంటి నెక్‌లైన్‌ను కార్సెట్ టాప్ కలిగి ఉన్న ఈ గౌనులో డిస్నీ ప్రిన్సెస్‌లా మెరిసిపోయింది తమన్నా.

అవుట్‌ఫిట్ మొత్తం చిన్న చిన్న అలంకారాలు బీడ్‌వర్క్‌లను అందించారు డిజైనర్. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా చెవులకు భారీ ఇయర్ రింగ్స్ ను అలంకరించుకుంది. చేతి వేళ్లకు స్టేట్‌మెంట్ ఉంగరాలను పెట్టుకుని న్యూడ్ మేకప్ తో కుర్రాళ్ల మదిని దోచింది. ఈ అవుట్‌ఫిట్ తో చేసిన పిక్స్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.