Viral News : కొన్ని వ్యాధులు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంటాయి. కొన్ని అరుదైన వ్యాధులు కూడా ఉంటాయి. అవి కేవలం ప్రపంచంలో ఓ వంద మందికో.. 50 మందికో సంభవిస్తూ ఉంటాయి. అలాంటి వ్యాధుల్లో ఒకటి.. మధ్యప్రదేశ్‌లోకి ఓ యువకుడికి వచ్చింది. దాని కారణంగా అతనికి ఒళ్లంతా జుట్టు పెరిగిపోయింది. మొహంపై కూడా 5 అంగుళాల పొడవున జట్టు పెరిగింది. చూస్తేనే భయపడేలా తయారయ్యాడు. అతనికి ‘వేర్‌ఉల్ఫ్ సిండ్రోమ్’ అనే వ్యాధి సోకినట్టు వైద్యులు తేల్చారు.
ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తికి శరీరమంతా విపరీతమైన జుట్టు పెరుగుతుందట. ప్రపంచంలో ఇప్పటి వరకూ కేవలం 50 మందికి మాత్రమే ఈ వ్యాధి సోకిందని వైద్యులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలోని నంద్లేటా గ్రామానికి చెందిన లలిత్ పాటిదార్ అనే 17 ఏళ్ల యువకుడు వేర్‌ఉల్ఫ్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్నాడు. తల మొదలు కాలి గోటి వరకూ ఇతనికి దట్టంగా వెంట్రుకలు పెరిగాయి. లలిత్ ముఖంపై దట్టంగా జుట్టు ఉండటంతో ఆయనను కొందరు హనుమంతుని బాల స్వరూపంగా భావింస్తే.. మరికొందరు అసహ్యించుకుంటున్నారు.
ఇక ఒంటిపై ఈ జుట్టును ఎన్నిసార్లు కత్తిరించినా మళ్లీ పెరుగుతూనే ఉంటుందట. లలిత్‌కు పుట్టుకతోనే వెంట్రుకలు ఉన్నాయట. కానీ వైద్యులు అలా కొందరికి సర్వ సాధారణం అనుకుని తొలగించేశారు. కానీ ఆరేళ్లు వచ్చేసరికి శరీరమంతా జుట్టు పెరిగింది. వెంటనే లలిత్ తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా అతను ‘వేర్‌ఉల్ఫ్ సిండ్రోమ్’ వ్యాధి బారినపడినట్లు చెప్పారు. తనను చూసి భయపడి రాళ్లతో సైతం కొట్టేవారని లలిత్ చెప్పాడు. ప్రస్తుతం లలిత్ ఇంటర్ చదువుతున్నాడు. అయితే 21 ఏళ్లు నిండాక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చని వైద్యులు సూచించారని లలిత్ తెలిపాడు.