టాలీవుడ్ లో చాలా మంది రచయితలు దర్శకులుగా మారి సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకులలో చాలా మంది రచయితలుగా కెరియర్ స్టార్ట్ చేసిన వారే. తరువాత వారు టర్న్ తీసుకొని డైరెక్టర్స్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ లు అందుకున్నారు. ఇప్పటికి కొంత మంది అగ్ర రచయితలు దర్శకులుగా మారేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో యంగ్ టాలెంటెడ్ రైటర్ ప్రసన్న కుమార్ కూడా చేరాడు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే, ధమాకా సినిమాలకి రచయితగా వర్క్ చేసిన ప్రసన్న కుమార్ దర్శకుడిగా మారుతున్నాడు.
అది కూడా ఏకంగా కింగ్ నాగార్జున సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతూ ఉండటం విశేషం. అయితే ప్రసన్న కుమార్ దర్శకుడిగా మాత్రం తన సొంత కథతో ఎంట్రీ కావడం లేదు. మలయాళీ హిట్ మూవీ పోరంజు మరియం జోస్ రీమేక్ తో ప్రసన్న కుమార్ దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. రీసెంట్ గా చివరిగా ది ఘోస్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాగుందనే టాక్ వచ్చిన కూడా కమర్షియల్ గా డిజాస్టర్ అయ్యింది.
ఈ నేపధ్యంలో ఈ సారి స్ట్రైట్ కథతో కాకుండా హిట్ మూవీ రీమేక్ తో నెక్స్ట్ రావడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. త్వరలో ఈ మూవీ అఫీషియల్ గా లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. రచయితగా కమర్షియల్ హిట్స్ తో సక్సెస్ అందుకున్న ప్రసన్న కుమార్ డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడిగా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాడనేది చూడాలి.