Junior NTR: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య స్నేహ బంధం ఎలాంటిదో ఆర్ఆర్ఆర్ సినిమాతో రుజువైంది. ఈ చిత్రంలో వీరు కలిసి నటించి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అయితే, ఈ సినిమాలో రాజమౌళి చూపించింది కొంతేనని, నిజ జీవితంలో సైతం వీరిద్దరి మధ్య సినిమాకు మించి అనుబంధం ఉందని తాజాగా కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా వీరి స్నేహ బంధం ఎలాంటిదో అందరూ చూశారు.
తాజాగా టాలీవుడ్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. ఓ కొత్త విషయం తెలుస్తోంది. రామ్ చరణ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఓ త్యాగం చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు ఎన్టీఆర్‌తో ఓ ప్రాజెక్టును ఇటీవల ఓకే చేశారు. అయితే, ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలోని ప్రాజెక్టులో పని చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాకే బుచ్చిబాబుకు డేట్స్ ఇస్తానని చెప్పాడటన ఎన్టీఆర్. దీంతో ఇక తన గురువు సుకుమార్ వద్దకు వెళ్లి పుష్ప2 చిత్రం స్క్రిప్ట్ వర్క్‌లో సాయం చేస్తున్నాడట బుచ్చిబాబు.
మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్‌తో సినిమా చేస్తున్నాడు. అనంతరం జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్‌తో ఓ మూవీ చేయాల్సి ఉంది రామ్ చరణ్. అయితే, ఈ కథ చర్చల దశలోనే స్టాప్ అయ్యిందని టాక్ నడుస్తోంది. దీంతో రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో మూవీ తర్వాత ప్రాజెక్టు పరిస్థితి ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ వేరే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కథలు వింటున్నాడట.
Junior NTR: కథ నచ్చింది.. అందుకే బుచ్చిబాబు కథ ఫైనల్
ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ను కలిశాడట రామ్ చరణ్. తదుపరి ప్రాజెక్టు గురించి చర్చకు వచ్చిన క్రమంలో బుచ్చిబాబు తనకు చెప్పిన కథను రామ్ చరణ్ వద్ద ప్రస్తావించాడట ఎన్టీఆర్. ఈ కథ ప్రత్యేకంగా వింటే, నీకు నచ్చితే టేకోవర్ చేయవచ్చని సూచించాడట ఎన్టీఆర్. దీంతో బుచ్చిబాబును రామ్ చరణ్ పిలిపించుకొని కథ విన్నాడట. ఇక కథ బాగా కనెక్ట్ అవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ కోసం త్యాగం చేశాడట.