Vijay-Rashmika : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాల వ్యవహారం పెళ్లి పీటలెక్కిందంటూ పుకారు తాజాగా నెట్టింట షికారు చేస్తోంది. గత కొంతకాలంగా వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ వీరిద్దరూ ఏదో ఒక సందర్భంలో పట్టుబడుతూనే ఉన్నారు. ఇటీవలే వీరిద్దరూ ఇటీవలే మాల్దీవులకు ట్రిప్‌కు వెళ్లొచ్చిన విషయం కూడా తెలిసిందే. ఎంత సీక్రెట్‌గా జంప్ అవుదామనుకున్నా కూడా ఎక్కడో ఒకచోట దొరికిపోతున్నారు.
వీరిద్దరి సీక్రెట్ ప్రేమ వ్యవహారాన్ని ఎప్పుడు రివీల్ చేస్తారా? అని అభిమానులు కూడా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ బయట పడితేనా? పైగా అదేమీ లేదు.. మేమీద్దరం స్నేహితులం అని చెబుతూ వస్తున్నారు. తాజాగా వీరిద్దరికీ సంబంధించి ఒక షాకింగ్ ఫోటో వెలుగులోకి వచ్చింది. విజయ్, రష్మికలు పూలదండలు మార్చుకున్న పెళ్లి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో రష్మికను విజయ్ గట్టిగా పట్టుకోగా ఆమె సిగ్గుపడుతూ కనిపించింది. విజయ్.. రష్మికను పట్టుకుని ఉండగా.. ఆమె సిగ్గుతో తల దించుకున్నట్లుగా ఉంది.
విజయ్, రష్మిక ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వీళ్లిద్దరికీ పెళ్లైపోయిందన్నట్టుగా చెప్పిన విషయం తెలిసిందే. దీనికి వీరి పెళ్లి ఫోటో కూడా జత కావడంతో ఇదేంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు మాత్రం ఇదేదో ఫొటోషూట్ కావచ్చేమోనని అభిప్రాయపడుతున్నారు. చివరకు తేలిందేంటంటే అదొక మార్ఫింగ్ ఫోటో. వీళ్లెలాగూ చెప్పడం లేదని భావించిన అభిమానులు ఫోటో షాప్ చేసి వీరిద్దరికీ పెళ్లైపోయినట్టుగా క్రియేట్ చేశారు.