Minister Mallareddy : తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు, అల్లుడు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే మల్లారెడ్డి బంధువు నివాసంలో ఐటీ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. సుచిత్రలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి బంధువు త్రిశూల్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు రూ.2 కోట్లు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి కూడా కాలేజీలు నడుపుతున్నారు.నేటి ఉదయం మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
మొత్తం 50 బృందాలుగా విడిపోయి మరీ ఐటీ అధికారులు మెరుపు దాడి చేశారు. మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.కాగా.. మల్లారెడ్డి నివాసంలో దాడుల నేపథ్యంలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మెడికల్ కాలేజ్ సీట్ల విషయంలో గతంలోనే చాలా ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆ ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి. నిజానికి మెడికల్ కాలేజీలో సీట్లను కోటా ప్రకారం కేటాయించాల్సి ఉంటుంది. కాీన మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో కోటా ప్రకారం కాకుండా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్‌లపై ఉన్న బ్యాంకు లావాదేవీలను ఐటీ పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే మెడికల్ కాలేజ్ లావాదేవీల్లో భారీ వ్యత్యాసాలున్నట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్ నివాసంలోనూ ఐటీ సోదాలు చేస్తోంది.జైకిషన్ తండ్రి నరసింహ, మంత్రి మల్లారెడ్డి వ్యాపార భాస్వాములు కావడంతో ఆ దిశగా కూడా సోదాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జైకిషన్, మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌లు కలిసి క్యాసినోలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు.