నిన్నటి ఎపిసోడ్‌లో ముకుంద, మురారిలు కలుసుకుని తమ మనసులోని భావాలను చెప్పుకోవాలనుకుంటారు. కానీ అంతలోనే మురారికి భవాని ఫోన్ చేస్తుంది. దాంతో ముకుంద లెటర్‌ని ఇస్తుంది. కారులో వెళ్తూ మురారి ఆ లెటర్ తెరిచి చదువుతుంటాడు. అది గాలికి కొట్టుకుపోవడంతో మురారి అల్లారిపోతాడు. ఆ తర్వాత నవంబర్ 22 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మురారి జాబ్‌లో జాయిన్ అవుతాడు. మీ సీఐ ఎక్కడ అని ప్రశ్నిస్తాడు. గుడ్ మార్నింగ్ అంటూ వస్తాడు చంద్రశేఖర్. బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగిందని ఫైర్ అవుతాడు మురారి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని చంద్రశేఖర్‌కు క్లాస్ పీకుతాడు మురారి. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని నిలదీస్తాడు. శాంతి భద్రతల విషయంలో ప్రజలకు ఎలాంటి లోటు లేదని వివరిస్తాడు చంద్రశేఖర్. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకూడదని అంటాడు మురారి. బ్లాస్టింగ్ రిపోర్ట్ కావాలంటూ అడుగుతాడు సీఐని.
సీన్ కట్ చేస్తే.. కృష్ణ దగ్గరికి సుందరి వచ్చి ఏసీపీ గురించి చెబుతుంది. మనిషిని చూడకుండా నాకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే అది ఆ ఏసీపీనే అంటుంది కృష్ణ. చివరకు సుందరి ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయ్యాడని చెప్తుంది. దాంతో ఆనందంతో గెంతులు వేస్తుంది కృష్ణ. ఇప్పుడే వెళ్లి నాన్నా వీఆర్‌ఎస్ గురించి, శివన్న అరాచకాల గురించి చెప్తానంటుంది కృష్ణ.
గెస్ట్ హౌజ్‌కి వెళ్తున్న చంద్రశేఖర్, మురారిల కారును దారిలో ఆపుతారు. నన్న ఆశీర్వదించండి అంటూ మురారి పాదాభివందనం చేస్తాడు సీఐకి. మీరు నా గురువు గారు. శిక్షణ కాలంలో మీరు చెప్పిందంతా నేను పాటిస్తాను అంటాడు మురారి. వృత్తిలో మంచి పేరు తెచ్చుకోండి సర్ అని ఆశీర్వదిస్తాడు చంద్రశేఖర్. మీకు గురుదక్షిణ చెల్లించాలని అంటాడు మురారి. అంతలోనే కారు గెస్ట్‌హౌజ్ దగ్గరికి చేరుకుంటుంది. గది చూపించి సీఐ స్టేషన్‌కు వెళ్తాడు. మురారిని కలిసేందుకు వచ్చిన కృష్ణ, సుందరిలు చంద్రశేఖర్‌ని చూసి ఆగిపోతారు.
అంతలోనే శివన్న వచ్చి ఏసీపీని పరిచయం చేసుకుంటాడు. ఈ ఊరికి పోలీసులతో పని లేదు. నేనే పోలీసును. మీరెళ్లి స్టేషన్లో కూర్చుని గేమ్స్ ఆడుకోమని సూచిస్తాడు శివన్న. డబ్బు, పూలు, పండ్లు ఇచ్చి తన మనిషిని చేసుకుంటాడు శివన్న. అవి తీసుకోవడం చూసి కృష్ణకి కోపం వస్తుంది. వీడితో మాట్లాడి వేస్ట్ అంటూ కోపంతో వెళ్లిపోతుంది. ఆ తర్వాత శివన్న ఇచ్చిన గిఫ్ట్‌ని కింద పడేసి వార్నింగ్ ఇస్తాడు మురారి. వీళ్లను మెడపట్టి బయటికి గెంటేయమని కానిస్టేబుల్స్‌కు సూచిస్తాడు. ఏసీపీ సాబ్ కూల్ కూల్ అంటాడు శివన్న. స్టేషన్‌కు వచ్చి నువ్ చేసిన నేరాలను ఒప్పుకోకపోతే పైకి పంపిస్తానంటూ వార్నింగ్ ఇస్తాడు మురారి.
సీన్ కట్ చేస్తే.. ముకుంద తన ఇంటికి వెళ్తుంది. ఇంట్లో పేరెంట్స్ మాత్రం తనకు కాబోయే వాడి ఫొటో పట్టుకుని చూపించాలని వెయిట్ చేస్తారు. ముకుంద తన మనసులోని మాట చెప్పాలనుకుంటుంది. అబ్బాయి వాళ్లకు నువ్ చాలా బాగా నచ్చావని, పెళ్లి కూడా ఫిక్స్ చేశామని చెప్తారు ముకుంద పేరేంట్స్. దాంతో ముకుంద నోట మాటరాదు. కాబోయే అత్తవారింటి గురించి చెప్తుంటే ముకుంద మిన్నకుండి పోతుంది. చివరకు మీ ఇష్టం నాన్నా అని చెప్పి గదిలోకి వెళ్లిపోతుంది. మరి ముకుంద మురారి గురించి ఇంట్లో చెప్తుందా లేదా తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..