ఇళయదళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం వారసుడు. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రెండు భాషలలో జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే దిల్ రాజు అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. అయితే దీనిపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సంక్రాంతి రేసులో రెండు తెలుగు సినిమాలు ఉండటం వలన డబ్బింగ్ సినిమాలకి సెకండ్ ప్రాధాన్యత ఇవ్వాలని దిల్ రాజుకి లేఖ రాసారు. అయితే దీనిపై దిల్ రాజు ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక వారసుడు సినిమా సంక్రాంతి రిలీజ్ వాయిదా వేసుకోవాలని చెప్పడంపై తమిళ దర్శకులు, విజయ్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగా ఫాన్స్, బాలయ్య ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో తెలుగు, తమిళనాడు మధ్య వారసుడు వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వారసుడు సినిమా రిలీజ్ అడ్డుకుంటే మాత్రం తెలుగు సినిమా తమిళనాడులో రిలీజ్ కానివ్వం అంటూ హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ తాజాగా రియాక్ట్ అయ్యారు. వారసుడు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయొద్దని అనడం సరైన నిర్ణయం కాదని అన్నారు. ఇప్పుడు సినిమా మార్కెట్ పరిధి పెరిగిందని, తమిళనాడులో తెలుగు సినిమాకి మంచి మార్కెట్ ఉందని, ఇక్కడ మనం ఆపితే అక్కడ వారు ఆపుతారని అన్నారు.
సినిమా అంతా భాషలకి అతీతంగా ఒకటే అయినపుడు ఎప్పుడు రిలీజ్ అయిన స్వాగాతించాలని, వాయిదా వేసుకోవాలని చెప్పడం అవివేకం అంటూ కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వారసుడు మూవీ రిలీజ్ వాయిదా వేయమని చెప్పడం సమంజసం కాదన్నారు. తమిళ్ హీరోతో ఒక తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాత చేసిన సినిమా తెలుగులో రిలీజ్ కి అడ్డంకి పెట్టడం హాస్యాస్పదంగా ఉందని దయ్య బట్టారు. సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలనేది నిర్మాతల ఇష్టం అని దానిలో ప్రాధాన్యతలు ఎంచకూడదు అంటూ చెప్పుకొచ్చారు.