సౌత్ ఇండియాలో టాలెంటెడ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న ఫీమేల్ మేకర్ సుధా కొంగర. సాలా ఖండూస్, ఆకాశం నీ హద్దురా సినిమాతో ఈమె స్టామినా ఏంటో అందరికి పరిచయం అయ్యింది. ఇక ఆకాశం నీ హద్దురా సినిమా కమర్షియల్ సక్సెస్ తో పాటు ఏకంగా నేషనల్ అవార్డులని కూడా సొంతం చేసుకుంది. హీరో సూర్య కెరియర్ లో మరో గొప్ప చిత్రంగా ఈ మూవీ నిలిచిపోతుంది. ఇక ఆ సినిమా తర్వాత సుధా కొంగర చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ తన కొత్త ప్రాజెక్ట్ పై వర్క్ చేయడం మొదలు పెట్టింది. ఈ సారి కూడా ఆమె బయోపిక్ నే సినిమాగా చేయాలనీ డిసైడ్ డిసైడ్ అయ్యింది. ఈ సారి ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా జీవిత కథని తెరపై ఆవిష్కరించడానికి సుధా కొంగర సిద్ధం అయినట్లు తెలుస్తుంది.
ఇక ఈ మూవీ కోసం ఇప్పటికే రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేయడంతో పాటు స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసే పనిలో ఉందని తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని ఆవిష్కరించడానికి ఈమె ప్లాన్ చేసుకుంటుంది. రతన్ టాటా అంటే కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా ఇండియాలో అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితాలో ఒకరుగా ఉంటారు. 80 ఏళ్ళు పై బడిన కూడా ఇప్పటికి విశ్రాంతి తీసుకోకుండా కంపెనీ బాధ్యతలని చూసుకుంటున్నారు.
అలాగే నిరాడంబర జీవితానికి రతన్ టాటా ఒక రోల్ మోడల్, అతను తన కంపెనీ ద్వారా సంపాదించే మొత్తంలో సగానికి పైగా ప్రజాసేవ కోసమే ఉపయోగిస్తూ ఉంటారు అనే విషయం అందరికి తెలిసిందే. ఇండియాలోనే మొట్టమొదటి కుబేరులలో ఒకడిగా రతన్ టాటా నిలుస్తారు. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయం. ఇప్పుడు అలాంటి వ్యక్తి కథని తెరపై ఆవిష్కరించడానికి సుధా కొంగర సిద్ధం అవుతూ ఉండటం విశేషం. ఇక రతన్ టాటా పాత్ర కోసం బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ని ఆమె ఎంపిక చేసుకుందని తెలుస్తుంది.