Punch Prasad: జబర్దస్త్ కామెడీ షో వేదికగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు “ప్రసాద్”. ఎంత పాపులర్ అయిపోయారంటే తాను వేసే పంచులు గుర్తుగా అందరు ముద్దుగా “పంచ్” ప్రసాద్ అని పిలిచేంత. యూత్ తో పాటు, బుల్లితెర ఫామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంటాయి పంచ్ ప్రసాద్ స్కిట్స్. అయితే ఈ మధ్య పంచ్ ప్రసాద్ జబర్దస్త్ షో లో కనిపించడం లేదు. దానికి కారణం తన ఆరోగ్యం విషమించడమే కారణం అనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు.
విషమించిన ఆరోగ్యం..?
అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో ప్రసాద్ తన కిడ్నీలు పాడైపోయిన సంగతి బయటపెట్టాడు. అయితే అందరు దాన్ని ఒక చిన్న సమస్యగానే చూశారు. అయితే ఇటీవల ప్రసాద్ ఆరోగ్యం బాగా క్షీణించి, నడవలేని స్థితికి చేరుకున్నాడని జబర్దస్త్ నూకరాజు తెలపడం ప్రసాద్ అభిమానులను ఆందోళనకు గురి చేసింది. పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అండగా భార్య..
ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని కానీ.. చాల జాగ్రత్తలు, క్రమం తప్పకుండ డయాలిసిస్ చేయడం వంటివి ఇంకా చాలా రోజులు కొనసాగించాల్సి వస్తుందని తెలిపారు. ఇటీవల ఒక యూట్యూబర్ వ్లాగ్ ద్వారా ప్రసాద్ ఆరోగ్య పరిస్థితుల గురించి వెల్లడించడంతో.. మొదటి కన్నా చాలా బెటర్ అని, ఇంకా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో తన భార్య అండగా ఉండి.. కంటికి రెప్పలా ప్రసాద్ ను కాపాడుతుంది.
Punch Prasad:
మంచి ప్రతిభ కలిగిన ప్రసాద్, వ్యక్తిత్వం కూడా చాలా గొప్పది. ఎప్పుడు ఇలాంటి మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయేమో అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. మొత్తానికి ప్రసాద్ ప్రాణానికి ప్రమాదం లేదని తెలియడంతో అందరూ కొంత మేర సంతోషిస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయి ఆరోగ్యవంతునిగా మళ్ళీ వేదికలపైకి వచ్చి అందర్నీ నవ్వించాలని ఆశిస్తున్నారు అభిమానులు.