Bhumi pednekar : ఇన్ స్టాగ్రామ్ క్వీన్ భూమి భూమి పెడ్నేకర్ తన ఫ్యాషన్ డైరీలలోని స్నిప్పెట్‌లతో ఫ్యాషన్ ప్రియులను ఉర్రూతలూగించే పనిలో పడిపోయింది . ఈ బ్యూటీ ఇటీవల జరిగిన అవార్డుల వేడుకలో తన రెడ్ కార్పెట్ లుక్స్ నుండి కొన్ని పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. వైట్ గౌన్ లో ఉన్న భూమి హాట్ పిక్స్ ఇంటర్నెట్ లో అలజడిని సృటిస్తున్నాయి.

Bhumi pednekar : భూమి ఫ్యాషన్ డిజైనర్ హౌస్ రామి కడి మైసన్ డి కోచర్‌కి మ్యూజ్ ప్లే చేసింది. ఈ సందర్భంగా చేసిన ఒక ఫోటో షూట్ కోసం తెల్లటి గౌనును ఎంచుకుంది. గోల్డెన్ థ్రెడ్స్, సీక్విన్ వివరాలను కలిగిన ఆఫ్-షోల్డర్ గౌనులో ఎంతో హాట్ గా కనిపించింది ఈ భామ . థై హై స్లిట్ లాంగ్ ట్రైన్ అవుట్ ఫిట్ కి మెస్మరైజింగ్ లుక్ ను అందించింది.

తన రూపానికి మరిన్ని స్టైలిష్ వైబ్‌లను జోడించేందుకు భూమి తెల్లటి ఈక వివరాలతో అలంకరించిన తెల్లని హ్యాండ్ గ్లౌజ్ లను వేసుకుంది.

అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మ్యాచ్ అయ్యేలా పాదాలకు క్లాసిక్ సిల్వర్ ఫుట్ వేర్ ను, చెవులకు తెలుపు రంగు ఇయర్ రింగ్స్ అలంకరించుకుని భూమి అద్భుతంగా కనిపించింది.

భూమి తన లుక్ కు అనుగుణంగా మినిమల్ మేకప్ ఎంచుకుంది . న్యూడ్ ఐ ష్యాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ మాస్కరా వేసుకుని , కనుబొమ్మలు డార్క్ చేసి పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ వేసుకుని తన గ్లామరస్ లుక్స్ తో యూత్ ను క్లీన్ బౌల్డ్ చేసింది.

ప్రస్తుతం భూమి గోవిందా నామ్ మేర అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విక్కీ కౌశల్ హీరోగా , కియారా అద్వానీ, భూమి నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం లో భూమి పెడ్నేకర్ తన పెర్ఫార్మెన్స్ తో ఓ రేంజ్ లో రచ్చ చేయనుందని ట్రైలర్ లో తెలుస్తోంది. ఓ వైపు మూవీ షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు ఫ్యాషన్ ప్రొమోషన్స్ చేస్తూ కుర్రాళ్ళకు కునుకు కరువయ్యేలా చేస్తోంది ఈ హాట్ బ్యూటీ
