సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని పాన్ వరల్డ్ లెవల్ లో తెరకెక్కించడానికి జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ఇక దీనికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. విజయేంద్రప్రసాద్ ఈ మూవీ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇక జక్కన్న కూడా ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్టర్స్ ని రంగంలోకి దించడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి మరోసారి ఈ సినిమాకి సంబందించిన ఆసక్తికర అప్డేట్ ని ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో సినిమాకి సంబందించిన విషయాలు పంచుకున్నారు. ఇక సూపర్ స్టార్ తో చేయబోయే సినిమా కోసం తాను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని చెప్పాడు.
తనకి ఇండియానా జోన్స్ లాంటి అడ్వాంచర్ కథలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అని, అలాంటి కాన్సెప్ట్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు చెప్పాడు. ఆ అవకాశం ఇప్పుడు సూపర్ స్టార్ సినిమాతో వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. ఇది కంప్లీట్ గా అడ్వాంచర్ స్టోరీతో సిద్ధం అవ్వబోయే సినిమా అని చెప్పాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రానటవంటి కథతో మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు చెప్పారు.
అలాగే భారీ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్న కూడా బాహుబలి, ఆర్ఆర్ఆర్ కోసం తీసుకున్నంత టైం అయితే తీసుకోను అని క్లారిటీ ఇచ్చారు. వీలైనంత వేగంగానే మూవీ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తా అని చెప్పారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ ని మా కజిన్స్ తో పాటు ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నారని, మొత్తం స్క్రిప్ట్ రెడీ అయిపోతే అప్పుడు తాను ఎంట్రీ అవుతానని చెప్పాడు. ఇక త్వరలోనే దానికి సంబందించిన ప్రకటన కూడా ఉంటుందని స్పష్టం చేశారు.