Single Life: ఎన్నో కారణాల వల్ల చాలా మంది సింగల్ గా ఉండిపోతున్నారు. కొంతమందికి బ్రేకప్ అయ్యి సింగల్ గా ఉంటే కొంతమంది అసలు రిలేషన్ షిప్ లోనే ఉండరు. ఇటీవల విడాకుల శాతం పెరిగిపోవడంతో విడిపోయిన వారు కూడా సింగల్ గానే ఉంటున్నారు. రిలేషన్ షిప్ లో ఉన్నవారిని చూస్తే సింగిల్ గా ఉన్న చాలా మందికి అరే వాళ్ళ లాగా ఉంటే బాగుండేదే అనిపిస్తుంటుంది. ఇది సహజం. అయితే సింగిల్ గా ఉండడం కూడా కొన్ని ప్రయోజనాలు కలిగి ఉంది.
సింగిల్ లైఫ్ లో ఉండే మజానే వేరయా..
ఏదైనా రిలేషన్ షిప్ లో ఉన్నప్పటితో పోలిస్తే సింగిల్ ఉన్నప్పుడు మనుషులు మారిపోతారు. ఏ విషయం మీదైనా సొంత నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. దీంతో మరింత బాధ్యతాయుతంగా ఉంటారు. దేని మీదా ఇతరుల ప్రభావం ఉండదు కాబట్టి సింగిల్ గా ఉన్నవారు ఇంకా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ సమయాన్ని తమకోసం వినియోగించుకోవాలి అంటుంటారు నిపుణులు.
ఏదైనా రిలేషన్ లో ఉంటే ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. వివాహితులకి ఈ ఒత్తిడి మరీ ఎక్కువ. కుటుంబ బాధ్యత చూసుకోవాలి. భర్త గురించి,పిల్లల గురించి ఆలోచించాలి. సింగిల్ గా ఉన్నప్పుడు ఏ రకమైన ఒత్తిడీ ఉండదు కాబట్టి జీవితంలో ఉన్న మజాని పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఖాళీ సమయాన్ని తమ కోసం వినియోగించవచ్చు.
Single Life:
కెరీర్ పట్ల ఆశలు ఉన్న ఆడవారు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి ఒత్తిడీ లేకపోవడంతో చేస్తున్న పని మీదా లేదా చేయాలి అనుకుంటున్న పని మీద పూర్తి శ్రద్ధ వహించవచ్చు. సింగిల్ గా ఉండడం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే,ఖాళీ సమయంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రయాణానికి ప్రణాళికలు రచించుకుని కావాల్సిన చోట్లకి ఎంచక్కా వెళ్ళిపోవచ్చు.