Hindu Temple Harathi: హిందూ దేవాలయాలు, హిందూ సంస్కృతి అత్యంత పురాతనమైనవి, చాలా గొప్పవి. ప్రతీ చిన్న విషయం ఎంతో దార్శనికతతో, శాస్త్రీయంగా రూపొందించబడ్డాయి. అలాంటి ప్రాముఖ్యత కలిగినదే గుడిలో గంట. ప్రతీ దేవాలయంలోనూ తప్పకుండ ఉండేది గంట. ఎవరు గుడికి వెళ్లిన ముందుగా ఎదురుగా ఉండే గంట కొడతారు. అయితే అసలు ఈ గంట వెనుక ఉన్న రహస్యం ఏంటి? దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? మీరే చదవండి..
ఇదే గంట అర్ధం.. పరమార్ధం.
“శబ్దం” హిందూ తత్త్వం ప్రకారం చాలా శక్తివంతమైనది. సకల శుభాలకు మూలం. చెడును, దుష్ట శక్తులను దూరం చేసే శక్తి కలిగి ఉంటుంది శబ్దం. అలాగే గుడిలో ఉండే గంట శబ్దానికి రకరకాల అర్ధం పరమార్ధాలు ఉన్నాయి. ప్రత్యేక పూజల సమయంలో కొట్టే గంట మనసుని స్థిరీకరించడంతో పాటు, ఏకాగ్రతను పెంచుతుంది. ఈ గంట శబ్దం ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది.
ఇక గంట ఆకారానికి వస్తే.. గంట నాలుకలో సరస్వతీదేవి, గంట ముఖభాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొనభాగంలో వాసుకి, పిడి భాగంలో ప్రాణశక్తి ఇమిడి ఉంటుందని.. అందుకే గంటను సాక్షాత్తు దైవ స్వరూపంగా తెలుపుతారు పండితులు. ఇక పిడిభాగం గరుడ, చక్ర, హనుమ, నంది మూర్తులతో దర్శన భాగ్యం కలిగిస్తుంది.
Hindu Temple Harathi:
ప్రత్యేకంగా కంచుతో తయారు చేసిన గంటను కొట్టినప్పుడు అది “ఓం” స్వరాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఓంకార నాదం అత్యంత శక్తివంతమైంది. ఇది చింతలు, సమస్యలు తొలగిస్తుంది. ఆధ్యాత్మిక భావన కలిగిస్తుంది. ఇక హారతి సమయంలో చేసే గంట శబ్దం దేవతలను భక్తితో ఆహ్వానించడానికి సంకేతం. శబ్దం చేస్తూ, జ్యోతి వెలుగుతో దేవతలను ఆహ్వానించి వారి ఆశీర్వాదం తీసుకుంటామని దాని పరమార్ధం.