Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సాధించిన కుటుంబాల్లో ఘట్టమనేని కుటుంబం ఒకటి. ఏఎన్నార్ ద్వారా స్పూర్తిని పొందిన కృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తిరుగులేని సూపర్ స్టార్ గా ఎదిగారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆయన ఈ మధ్యనే కాలం చేయగా.. ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
కృష్ణ అంతిమ సంస్కారాల సమయంలో జరిగిన ఓ ఘటన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కృష్ణ మరణంతో తీవ్రంగా కుంగిపోయిన మహేష్ బాబు.. బాధను ఆపకోలేకపోయారు. అయితే ఒక సందర్భంలో మహేష్, ఆయన కొడుకు గౌతమ్ నవ్వుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.
కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి సినీ ప్రముఖులు రాగా.. అందులో భాగంగా బాలయ్య తన కుటుంబంతో వచ్చారు. అక్కడే కాసేపు ఉండి అందరినీ ఓదార్చాడు. అయితే మహేష్ బాబు, గౌతమ్, మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ అక్కడ నిలబడి ఉండగా.. ఏదో విషయం చెప్పడంతో మహేష్, గౌతమ్ నవ్వినట్లు తెలుస్తోంది.
Mahesh Babu:
బాలయ్య తీవ్ర విషాదంలో ఉన్న మహేష్ కుటుంబాన్ని ఓదార్చాలనే ఉద్దేశంలో ఓ విషయం గురించి అడిగారట. మహేష్ బాబు కొడుకు గౌతమ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడు వస్తున్నాడంటూ బాలయ్య అడిగాడట. దాంతో మహేష్, పక్కనే ఉన్న ఆయన కొడుకు గౌతమ్ నవ్వుకున్నారు. కాగా ఈ ఏడాది వరుస విషాదాలతో కుంగిపోయిన మహేష్ ముఖం మీద బాలయ్య చిరు నవ్వు తెప్పించారని.. ఆయన మనసు నిజంగా బంగారం అంటూ అందరూ ఆయనను మెచ్చుకుంటున్నారు.