సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ, పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన చేతి నిండా ప్రస్తుతం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఎన్టీఆర్, కొరటాల సినిమా కోసం రష్మికని సంప్రదిస్తున్నారు. ఈ మూవీ కన్ఫర్మ్ అయితే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆమె చేతికి చిక్కినట్లే. మరో వైపు హీరో సూర్యతో కూడా జత కట్టడానికి రష్మిక రెడీ అవుతుంది. అలాగే బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేయబోతుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక తెలుగులో పుష్ప 2 షూటింగ్ త్వరలో జరగబోతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన రష్మిక ఇంకా సెట్ లో జాయిన్ అవ్వలేదు.
వచ్చే నెలలో ఆమె పుష్ప 2 షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య కాస్తా టైం దొరకడంతో సేదతీరడానికి అలా మాల్దీవులు వెళ్లి వచ్చింది. ఇప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది. ఇక కాంతారా సినిమా విషయంలో కన్నడ ప్రేక్షకులు రష్మికని దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ విషయంలో ఆమె బాగా హార్ట్ అయ్యి ఒక నోట్ కూడా రాసింది. ఇక తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఇందులో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పింది.
తాను ఏ మూడ్ లో ఉన్న వర్క్ అవుట్స్ చేస్తే వెంటనే కూల్ అయిపోతానని, రిలాక్ మోడ్ లోకి వచ్చేస్తానని చెప్పింది. బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, కోపంలో ఉన్నా కూడా వెంటనే వర్క్ అవుట్స్ చేయడం స్టార్ట్ చేస్తాను.దీంతో ఆ మూడ్ నుంచి తెలియకుండానే బయటకి వచ్చేస్తాను. ఎవరైనా ఇప్పటి వరకు వర్క్ అవుట్స్ చేయకపోతే ఇకపైన మొదలు పెట్టండి. నాకు ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో మీకు కూడా అలాంటి భావన కలుగుతుంది అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.