యంగ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ చాలా గ్యాప్ తీసుకొని ఆహా నా పెళ్ళంటా అనే వెబ్ సిరీస్ తో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. సినిమాలతో సక్సెస్ కాకపోవడంతో మరి లాభం లేదనుకొని వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో రాజకేసేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ రాజ్ తరుణ్ కి జంటగా నటించింది. చాలా కాలంగా రాజ్ తరుణ్ మళ్ళీ తనని తాను నిరూపించుకునే ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో కొంత నిరాశలో ఉన్నాడని చెప్పాలి.
ఇలాంటి సమయంలో ఆహా నా పెళ్ళంటా వెబ్ సిరీస్ అతనికి చాలా ఊరటనిచ్చింది. లవ్, రొమాంటిక్, కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. సినిమాకి ఏమీ తక్కువ కానీ స్థాయిలో దర్శకుడు దీనిని ఆవిష్కరించాడు. ఇక ఓటీటీ ప్రేక్షకులు తెలుగు వెబ్ సిరీస్ లలో ఈ మధ్యకాలంలో కాస్తా ఫ్యామిలీతో కలిసి చూసే వెబ్ సిరీస్ ని కోరుకుంటున్నారు. కొన్ని డబ్బింగ్ వెబ్ సిరీస్ లు వస్తున్న కూడా అన్ని క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లోనే వస్తున్నాయి. అయితే కొత్తదనం ఉంటూ ప్లెజెంట్ గా ఉండే వెబ్ సిరీస్ లు రావడం లేదు. ఇలాంటి సమయంలో జీ5లో వచ్చిన ఆహా నా పెళ్ళంటా ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది.
రాజ్ తరుణ్ చాలా కాలం తరువాత ఫుల్ ఈజ్ తో ఓ వైపు కామెడీ పండిస్తూనే మరో వైపు ఫ్యామిలీ బాండింగ్ మధ్య నలిగిపోయే యువకుడిగా మెప్పించాడు. ఇక శివానీ రాజశేఖర్ కి సరైన క్యారెక్టర్ పడితే తన నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుందని ఈ వెబ్ సిరీస్ తో ప్రూవ్ చేసుకుంది. కరెక్ట్ గా తనని వాడుకుంటే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కావాల్సిన ఫీచర్స్ శివాని రాజశేఖర్ లో ఉన్నాయి. ఎక్కడా కూడా అతి లేకుండా క్యారెక్టర్ కి సరిపోయే విధంగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో శివాని ఆకట్టుకుంది. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ తో రాజ్ తరుణ్ కోరుకున్న హిట్ అయితే వచ్చిందని చెప్పాలి. ఈ వెబ్ సిరీస్ తర్వాత మళ్ళీ హీరోగా తనకి సెట్ అయ్యే కథలతో ఈ యంగ్ హీరో బిజీ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.