రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం కాంతారా. ఈ మూవీ కన్నడంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో మిగిలిన సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన అన్ని భాషలలో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఆయా భాషలలో నిర్మాతలు తక్కువ ధరకి ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకొని పదిరెట్లు లాభాలు ఆర్జించారంటే అతిశయోక్తి కాదు. తెలుగులో ఈ మూవీ ఏకంగా 60 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కేవలం ఈ మూవీ తెలుగు రైట్స్ ని అల్లు అరవింద్ 5 కోట్లకి మాత్రమే కొనుగోలు చేశారు. అయితే మౌత్ టాక్ తో ఈ మూవీ జనాల్లోకి వెళ్ళింది. రెండో రోజు నుంచే థియేటర్స్ హౌస్ ఫుల్ తో రన్ అయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని భాషలలో కలిపి కాంతారా మూవీ ఏకంగా 350 కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 15 కోట్లు మాత్రమే. ఈ మూవీలో కంటెంట్ శివతత్వం, ప్రాచీన సనాతన ధర్మంలోని మూలాల్ని టచ్ చేస్తూ కథ చెప్పిన విధానం ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ కారణంగా సినిమాని ఒకటికి రెండు సార్లు చూడటానికి ఆడియన్స్ ఇష్టపట్టారు.
దీంతో భారీ కలెక్షన్స్ ని కాంతారా మూవీ కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని భారీ ధరకి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారానే ఈ మూవీకి పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. నవంబర్ 24న మూవీ అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కాబోతున్నట్లు చెప్పారు. మరి ఓటీటీలో ఈ మూవీ ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.