Rashmika: పుష్ప సినిమా సూపర్ హిట్ తర్వాత నేషనల్ వైడ్ క్రేజ్ సాధించింది కన్నడ బ్యూటీ రష్మిక. సీతారామం మూవీలో కీలక పాత్రలో నటించి అందరి మొప్పు పొందింది. దీంతో సౌత్ ఇండియాతోపాటు బాలీవుడ్‌లోనూ వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల అమితాబ్‌తో కలిసి నటించిన గుడ్ బై చిత్రం రిలీజవగా అంతగా ఆకట్టుకోలేదు. అయితే పెద్ద పెద్ద స్టార్లకు కూడా సాధ్యం కాని రీతిలో బిగ్‌బీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆమెకు పెద్ద ప్లస్ అయ్యింది.
రష్మిక గుడ్‌బై చిత్రం కంటే ముందే మిషన్ మజ్ను అనే చిత్రానికి ఒప్పందం చేసుకుంది. శంతను బాగ్చీ డైరెక్షన్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా లీడ్‌రోల్‌లో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఇటీవలే షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని సమాచారం. స్పై థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీని తొలుత థియేటర్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.
బాలీవుడ్‌లో నిలదొక్కునే ఆశలపై నీళ్లు..
అయితే మూవీ ఔట్ పుట్‌పై అనుమానాలు రావడంతో ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. థియేటర్‌లో రిలీజైతే తన డిమాండ్ మరింత పెరుగుతుందని రష్మిక ఆశపడగా, ఇప్పుడు నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌పై రష్మిక అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో సాలిడ్ హిట్‌తో నిలదొక్కుకోవాలని భావిస్తున్న తరుణంలో ఆమెకు ఇలా ఎదురుగాలి వీయడం కెరీర్‌కు బ్రేక్ వేసే పరిణామమే.
Rashmika:
ఇకపోతే ఆమె అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్ వంగ డైరెక్షన్‌లో రణ్‌బీర్ హీరోగా వస్తున్న యానిమల్ మూవీలోనూ రష్మిక నటిస్తోంది. గుడ్ బై, మిషన్ మజ్ను వల్ల ఉపయోగం లేకపోవడంతో యానిమల్ మూవీపైనే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో థియేటర్‌లోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు. తెలుగులో పుష్ప2తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆమె చేస్తోంది.