Saara Ali Khan : ఒక్కో నటికి ఒక్కో ఫ్యాషన్, ప్యాషన్ ఉంటుంది. తెరముందు కనిపించే తారలంతా తెర వెనుక మేకప్ లేకుండా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంటారు, వైవిధ్యమైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు. షూటింగ్ ల గందరగోళం , ఫ్యాన్స్ హడావిడి లేని ప్రైవసీ ప్రాంతాలకు వెళ్లి వారికీ నచ్చిన లైఫ్ ను లీడ్ చేస్తుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ అదే మూడ్ లో ఉంది.

Saara Ali Khan : సారా అలీ ఖాన్ ప్రస్తుతం దేశ నలుమూలలకు ప్రయాణిస్తోంది. నటి ఇటీవల దేశంలోని గ్రామీణ ప్రాంతాన్ని సందర్శించి అద్భుతమైన ఫ్యాషన్ ఫోటోషూట్ చేసింది. ఈ నటి ఆరు గజాల గులాబీ రంగు చీరను కట్టుకుని దేశ సంస్కృతి, అందం , సంప్రదాయాలను ప్రదర్శించింది. నిర్వాసితుల ప్రాంతంలో పాడైపోయిన నవారు మంచం పైన కూర్చుని కెమెరాకు పోజులు ఇచ్చింది.

ఈ చీరతో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను సారా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి . మీరు ఎక్కడికి వెళ్లినా ఏదో ఒకవిధంగా మీలో వారు భాగం అవుతారు అని ఆమె తన చిత్రాలకు క్యాప్షన్ ఇచ్చింది సారా . ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ సారా సింప్లిసిటీ ని కొనియాడుతూ ఇన్ బాక్స్ లో పొగడ్తలతో మెసేజ్ లు చేస్తున్నారు. సారా తన చీరను పొట్టి స్లీవ్‌లతో, విభిన్నమైన ఆకుపచ్చని ,తెలుపు రంగుల్లో వచ్చిన సీక్విన్డ్ బ్లౌజ్‌తో జత చేసింది. ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు రంగు బ్యాంగిల్స్‌ను చేతికి వేసుకుని దేశి స్టయిల్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తోంది.

సారా తన కనులకు న్యూడ్ ఐ ష్యాడో, బ్లాక్ ఐ లైనర్, మస్కరాను కనురెప్పలకు వేసకుంది. పేదలకు ఎరుపు రంగు లిప్‌స్టిక్ దిద్దుకుని అద్భుతంగా కనిపించింది. కుర్రాళ్ళ మనసును దోచేసింది. సోషల్ మీడియా లో సారాకు మంచి ఫాలోయింగ్ ఉంది . ఈ భామ అద్భుతమైన ఫోటో షూట్ లు చేస్తూ వాటిని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫాలోవర్స్ ను ఇంప్రెస్ చేస్తుంది. ఏ పిక్ పోస్ట్ చేసినా ఇంటర్నెట్ లో వైరల్ అవ్వాల్సిందే.
