Samantha : సమంత ఇటీవలే తాను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె అనారోగ్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. తాజాగా సామ్ లీడ్ రోల్ పోషించిన ‘యశోద’ మూవీలో నటించిన కల్పిక గణేష్.. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత ఏ స్టేజ్‌లో ఉందో తాజాగా వెల్లడించి షాక్ ఇచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో తన వ్యాధి గురించి సామ్ చెప్పిన విషయాలే షాకింగ్‌గా ఉంటే.. ఇక కల్పిక చెప్పిన విషయాలు మరింత విస్మయానికి గురి చేస్తున్నాయి.
గత శుక్రవారం విడుదలైన యశోద మూవీ పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.20 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగి తేలుతోంది. ఈ క్రమంలోనే సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్‌లో కల్పిక గణేష్ మాట్లాడుతూ.. సమంతలాగే తాను కూడా ఆ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించి షాక్ ఇచ్చింది. అంతేనా సామ్ అనారోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ సక్సెస్ మీట్‌కు సమంత హాజరు కాలేదు. దీనిపై కల్పిక మాట్లాడుతూ.. తామంతా సమంతని మిస్ అవుతున్నామని.. అయితే ఈ మీట్‌కి సామ్ వస్తున్నారని తనకు అబద్ధం చెప్పారని చెప్పింది. ఆమె నిజంగానే వస్తోందనుకుని తనకు ఆసుపత్రిలో అపాయింట్‌మెంట్ ఉన్నా వదిలేసి మరీ ఈ సక్సెస్ మీట్‌కి పరిగెత్తుకుంటూ వచ్చానని తెలిపింది. సమంతకి ఉన్న హెల్త్ ఇష్యూ తనకు కూడా గత 13 ఏళ్ల నుంచి ఉందని వెల్లడించింది. అయితే తానిప్పుడు ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నానని.. సమంత థర్డ్ స్టేజ్‌లో ఉందని కల్పిక తెలిపింది.