Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో జగతి రిషి పంపిన మెయిల్ చూసి ఆ ఫంక్షన్ కి వెళ్తాను అని మురిసిపోతుంది. కానీ మహేంద్ర మాత్రం కాస్త ఓపిక పట్టు అని అంటాడు. జగతి మాత్రం ఇప్పుడు వెళ్లకపోతే రిషి నన్ను ఎప్పటికీ క్షమించడు అని అంటుంది. అంతేకాకుండా మీడియా ముందు వసు మాట్లాడే మాటలను నేను వినాలి, చూడాలి అని అంటుంది. వెంటనే మహేంద్ర వర్మ అని చెప్పాల్సింది చెప్పాను అని అక్కడి నుంచి వెళ్తాడు.
మరోవైపు ఇంటర్వ్యూ కోసం వసు రెడీ అవుతుంది. ఇక అప్పుడే రిషి రావటంతో వెళ్దాం అని అంటుంది. ఇక రిషి తనకు ఆల్ ది బెస్ట్ చెబుతాడు. దాంతో వసు జగతి మేడం వస్తే బాగుండు అని అంటుంది. వెంటనే రిషి ఎవరు వచ్చిన రాకున్నా ధైర్యంగా ఫేస్ చేయాలి అని అంటాడు. నీ వెనకాల నేను ఉన్నాను అని అంటాడు. అయిన కూడా వసు జగతి మేడం ఉంటే బాగుంటుంది అని అంటుంది.
ఇక ఈ మాటలు విని దేవయాని బాగా కోపంతో కనిపిస్తుంది. ఆ తర్వాత రిషి వాళ్ళు తన పెద్దమ్మతో మేము కూడా వెళ్తున్నాము అని అంటాడు. అంతే కాకుండా వసు కు ఆల్ ది బెస్ట్ చెప్పరా అని అంటాడు. దాంతో దేవయాని ఇష్టం లేకుండా ఆల్ ది బెస్ట్ అని చెబుతుంది. తన మనసులో దేనికైనా టైం రావాలి అని అనుకుంటుంది. కాలేజీలో ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి.
ఫణింద్ర వర్మ వసు కు ధైర్యం ఇస్తాడు. అదే సమయంలో గౌతమ్ ఫోన్ రింగ్ అవుతుంది. అక్కడ ఎవరు లేకపోవటంతో ఫణింద్ర వర్మ ఫోన్ తీసి మాట్లాడుతాడు. ఎవరు అని అడగటంతో.. వెంటనే మహేంద్ర వర్మ గొంతు గుర్తుపట్టి ఫోన్ కట్ చేయగా ఆ మాటలు విని అది మహేంద్ర వర్మ అని అనుకుంటాడు ఫణీంద్ర వర్మ. గౌతమ్ కి ఎందుకు ఫోన్ చేస్తాడులే అని లైట్ గా తీసుకుంటాడు.
ఇక అప్పుడే అక్కడికి గౌతమ్ రావడంతో నీ ఫోన్ కి ఫోన్ వచ్చింది అచ్చం మహేంద్ర గొంతు లాగా ఉంది అనటంతో.. గౌతమ్ కంగారు పడతాడు. రిషి కూడా తన తండ్రి పేరు వినగానే ఆశ్చర్యపోతాడు. వెంటనే గౌతమ్ దగ్గర ఫోన్ లాక్కొని ఆ నెంబర్ కు ఫోన్ చేయగా గౌతమ్ అనుకోని మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక రిషి మాటలు విని మహేంద్ర బాధతో ఫోన్ పెట్టేస్తాడు.
ఆ తర్వాత ఎవరు మాట్లాడటం లేదు అనటంతో గౌతమ్ వాళ్ళు వేరే వాళ్ళు అంటూ కవర్ చేస్తాడు. తర్వాత వసు జగతి మేడం గురించి గౌతమ్ ను అడుగుతాంది. ఇక గౌతమ్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్తాడు. దాంతో వసుకి అనుమానం వస్తుంది. ఇక జగతి మేడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రిషి తో కూడా అదే విషయం చెప్పి మాట్లాడుతుంది.
Guppedantha Manasu:
ఇక రిషి మాత్రం ధైర్యం ఇస్తూ ఉంటాడు. మరోవైపు జగతి ఇంట్లో ఇంతకు ఒక లెటర్ కనబడుతుంది. ఇక అందులో నేను వెళ్లకుండా ఉండలేకపోతున్నాను అని రాసి ఉండటంతో మహేంద్ర షాక్ అవుతాడు. ఓ వైపు వసు జగతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనకు ఇంటర్వ్యూ చేయటం ఇష్టం లేదు అనటంతో.. ఆవిడ కచ్చితంగా వస్తారు అని రిషి ధైర్యం ఇస్తాడు.