బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా మొదటి సీజన్ కంటే మరింత రసవత్తరంగా సాగుతుంది. ఈ సీజన్ లో ఎన్నడూ లేని విధంగా రాజకీయ ప్రముఖుల్ని కూడా బాలకృష్ణ వేదిక మీదకి తీసుకొచ్చి హోస్ట్ గా వారితో ఎంటర్టైన్మెంట్ పండిస్తున్నాడు. అయితే రాజకీయ నాయకులు వచ్చిన కూడా రాజకీయ సంబంధమైన విషయాలపై ఎక్కువగా చర్చించకుండా వ్యక్తిగత జీవితం, అలాగే ప్రేక్షకులకి పరిచయం లేని కొత్త విషయాలని చెప్పించే ప్రయత్నం బాలకృష్ణ ఈ అన్ స్టాపబుల్ షో ద్వారా చేస్తున్నాడు. ఇక తాజాగా ఎపిసోడ్ 4 ప్రోమోని ఆహా వారు టెలికాస్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ కోసం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి వస్తారనే ప్రచారం నడిచింది.
దానికి తగ్గట్లుగానే వారిని ఎపిసోడ్ 4 ప్రోమోతో బాలయ్య పరిచయం చేశాడు. బాలకృష్ణతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి నిజాం కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో వీరు ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ఆనాటి జ్ఞాపకాలని ఈ షో సాక్షిగా బాలకృష్ణ వారితో చెప్పించే ప్రయత్నం చేశారు. ఇక ఇందులో సడెన్ గా రాధిక కూడా రావడం విశేషం. ఆమెతో కూడా సినీ అనుభవాలని బాలకృష్ణ చెప్పించే ప్రయత్నం చేశారు.
ఇక ఈ ఎపిసోడ్ ప్రోమోలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బ్రతికున్నా కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాను అంటూ రాజశేఖర్ రెడ్డి మరణం సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనలని గుర్తు చేశారు. ఆ సందర్భంగా బాలకృష్ణ కూడా రాజశేఖర్ రెడ్డి గొప్పతనం గురించి ప్రశంసలు చేశారు.దీనికి సంబంధించి ఎపిసోడ్ శుక్రవారం టెలికాస్ట్ కాబోతుంది. ఇక రాధిక, కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డితో బాలకృష్ణ చేసిన సందడి నాలుగో ఎపిసోడ్ లో గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇద్దరు గెస్ట్స్ ని మాత్రమే పరిచయం చేసిన బాలయ్య ఈ ఎపిసోడ్ లో రాధికతో కలిపి ముగ్గురుతోముచ్చటించబోతున్నాడు. మరి ఈ ఎపిసోడ్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనేది వేచి చూడాలి.