Nushrrat Bharuccha : నుష్రత్ భరుచ్చా తరచుగా తాను కలలు కనే అవతారాలతో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంది. పార్టీ వేర్ నుంచి ఎత్నిక్ అవుట్ ఫిట్స్ వరకు ఈ భామ సరికొత్తగా కనిపిస్తూ కవ్విస్తుంటుంది. సోషల్ మీడియా వేదికగా ఈ భామ వీలు కుదిరినప్పుడల్లా తన ఫ్యాషన్ డైరీ ల నుంచి అద్భుతమైన అవుట్ ఫిట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఫ్యాన్స్ ను ఇంప్రెస్స్ చేస్తుంటుంది .

లేటెస్ట్ గా celebrity ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన అందమైన నీలిరంగు లెహంగాలో కనిపించి కవ్వించింది.

Nushrrat Bharuccha : మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ డిజైనర్ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించింది నిష్రత్ . డీప్ నెక్ లైన్ సీక్విన్ డీటెయిల్స్ తో డార్క్ బ్లూ ఫ్లోరల్ డిజైన్స్ తో వచ్చిన స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని దానికి జోడిగా హెవీ సీక్విన్ డీటెయిల్స్ తో వచ్చిన స్కర్ట్ ను ధరించింది. ఈ ఆవుట్ ఫిట్ కు షీర్ దుపట్టాను జోడించి తన లుక్ ను మరింత మెరుగ్గా కనిపించేలా చేసింది.

ఈ లెహంగా సెట్ లో తన అందాలు అన్నీ ఎలివేట్ అయ్యేలా కెమెరాకు హాట్ పోజులు ఇచ్చి ఫోటో లు దిగింది. ఈ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ బ్యూటీ. ఈ అవుట్ ఫిట్ లో నుష్రత్ ను చుసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ ను పిక్స్ కింద పోస్ట్ చేసారు.

వరుణ్ రహేజా జ్యువెల్లరీ బ్రాండ్ అజోటిక్యూ నుండి ఆభరణాల ను ఎన్నుకొని నుష్రత్ భరుచ్చా తన రూపాన్ని మరింత అందంగా మలచుకుంది. స్టైలిస్ట్ నిధి జైస్వానీ నుష్రత్ భరుచ్చా లుక్స్ ను మరింత స్టైలిష్ గా మార్చింది. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా నుష్రత్ భరుచ్చా బోల్డ్ బ్లూ స్మోకీ ఐ ష్యాడో , ఐ లైనర్ , మస్కారా వేసుకుంది. పెదవులకు న్యూడ్ లిప్ షేడ్ దిద్దుకుంది. సున్నితమైన గ్లామ్ మేకప్ రూపాన్ని ఎంచుకుని ఫ్యాన్స్ హృదయాలను దోచేసింది.
