Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ బాగా ఆకలి మీద ఉండటంతో తింటూ ఉంటాడు. వెంటనే తులసి అలా ఎందుకు తింటున్నారు అనడంతో.. నిన్ను టెన్షన్తో ఆకలి వేయలేదు అని.. ఇప్పుడు సమస్య తీరిపోయింది కాబట్టి బాగా ఆకలి వేస్తుంది అని అంటాడు. ఇక తులసి మాత్రం నాకు టెన్షన్ తీరి కడుపు నిండిపోయినట్లుగా ఉంది అని అంటుంది. అలా వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ప్రేమ్ వాళ్ళని చూసి మురుస్తాడు.
మరోవైపు ఇంట్లో పరంధామయ్యతో అనసూయ ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఈ వయసులో మనకు కోపాలు అవసరమా అని.. మీరంటే నందుకి చాలా ఇష్టం.. మీ పుట్టిన రోజును నన్ను చాలా గ్రాండ్ గా చేయాలనుకున్నాడు కానీ కానీ ఏం జరిగిందో చూశారు కదా అని అంటుంది. ఇక వాడు నీకోసం కొత్త బట్టలు తెచ్చాడు అని కానీ వాడు వెళ్లిపోయాడు అంటూ అందుకే నేను ఇస్తున్నాను తీసుకో అని ఆ బట్టలు ఇచ్చి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది.
ఆ తర్వాత అనసూయ బయట కాఫీ తాగుతున్న లాస్య దగ్గరికి వెళ్లి నువ్వు ఒక్కదానివే కాదు మామ గారికి కూడా ఇవ్వాలి అని అంటుంది. అంతేకాకుండా మీ మావయ్య గారు నేను ఇచ్చిన బట్టలు తీసుకున్నారు అంటూ.. మళ్లీ మన సినిమా మొదలవుతుంది అని సంతోషంగా చెప్తుంది. ఇక లాస్య కూడా మామయ్య గారిని ఈసారి చెయ్యి జారినివ్వద్దు అని అంటుంది.
ఆ తర్వాత పూజకి సిద్ధం చేయమని లాస్యకు చెబుతుంది. మరోవైపు ప్రేమ్, సామ్రాట్, తులసి లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు సంతోషంగా ఉన్న ఏదో ఒక సమస్య వస్తుంది అని సామ్రాట్ అంటాడు. ఇక ప్రేమ్ కూడా అవును అని అంటాడు. దాంతో తులసి కొన్ని డైలాగులు కొడుతుంది. అంతేకాకుండా కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత తులసి త్వరగా లేవండి అంటూ.. పంతులుగారు వస్తారు పూజకు సిద్ధం చేయాలి అని అంటుంది. మరోవైపు లాస్య మామయ్య గారు నిజంగా మీరు ఇచ్చిన బట్టలు వేసుకున్నారా అని అనుమానంతో అనసూయను అడుగుతుంది. ఇక అప్పుడే పని పరంధామయ్య ఆ బట్టలు వేసుకొని వస్తాడు. ఆ తర్వాత పూజలు చేస్తారు. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం సంతోషంగా లేరని గమనిస్తుంది లాస్య.
అదే సమయంలో అక్కడికి మాధవి వచ్చి తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది. వెంటనే అనసూయ జరిగింది మర్చిపోయి ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది అనడంతో తన తల్లిని లెక్కచేయకుండా తండ్రికి స్వీట్ తినిపించి ఆశీర్వాదం తీసుకుంటుంది మాధవి. ఇక మాధవిని లాస్య పలకరించడంతో మాధవి వెటకారంగా మాట్లాడుతుంది.
అదే సమయంలో పరంధామయ్య ఇక బయలుదేరుదాం అనడంతో అనసూయ ఆశ్చర్య పోతుంది. ఎక్కడికి అని అడగటంతో తులసి ఇంటికి అని అంటాడు. అనసూయ కోపంగా రగిలిపోతుంది. ఇక పరంధామయ్యను ఆపాలని ప్రయత్నం చేస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ పరంధామయ్యతో బయలుదేరుతారు. అనసూయ తో పాటు లాస్య, అభి చాలా ఫైర్ అవుతారు.
Intinti Gruhalakshmi:
ఇదంతా ఆ తులసి వల్లే అని లాస్య రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక తులసి ఈ పూజ మీ తాత కోసం చేస్తున్నాను అని ప్రేమ్ తో అంటుంది. దాంతో ప్రేమ్ అయితే తాతయ్యని తీసుకొచ్చే వాడిని కదా అనడంతో.. రాత్రి ఎంత గొడవైందో చూసావు కదా అని అంటుంది. ఇక పూజ అయిపోవడంతో అప్పుడే పరంధామయ్య వాళ్ళు వస్తారు. దాంతో తులసి ఆశ్చర్య పోతుంది. సంతోషంలో మునిగిపోతుంది.