Mouni Roy : పాస్టెల్ రంగులు, పువ్వులతో నిండిన సమ్మర్ ఫిట్‌లను అందరూ ఇష్టపడతారు . అలా అని వింటర్ సీజన్ ఏమి తీసిపోలేదు. సంపూర్ణ క్లాసిక్ ఫ్యాషన్ లను ఫాలో అయ్యే చల్లని సమయం ఇది. ఫ్యాషన్ ప్రేమికులు స్టార్ సెలెబ్రిటీ లు ఈ సీజన్ లో బెస్ట్ ఫ్యాషన్ స్టైల్స్ ను ఫాలో అవుతూ అందరిని మెస్మరైజ్ చేస్తుంటారు. బాలీవుడ్ నటి మౌని రాయ్ తన బెస్ట్ లుక్‌తో ప్రతి సీజన్ లో సరికొత్తగా కనిపిస్తూ లేటెస్ట్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తుంటుంది. తాజాగా ఈ జీరో సైజు బ్యూటీ బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ లో డిజైన్ చేసిన అదిరిపోయే అవుట్ ఫిట్ ను వేసుకుని కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేసింది.

Mouni Roy : ఫుల్ స్లీవ్స్ కలిగిన తెల్లటి చొక్కా పైన , లేత గోధుమరంగు , తెలుపు రంగులో వచ్చిన స్వెటర్ వేసుకుంది. వీటికి జోడిగా చిక్ టాన్ ప్లీటెడ్ మినీ స్కర్ట్‌ను ధరించింది. ఈ అవుట్ ఫిట్ లో ఎంతో హాట్ గా కనిపించింది మౌని రాయ్. ఈ డిజైనర్ పీఎస్ ఫ్యాషన్ లవర్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది.

ఈ డ్రెస్ కు మరింత స్టైలిష్ లుక్ ను అందించేందుకు లేత గోధుమరంగు వెయిస్ట్ కోట్ భజాల పైగా వేసుకుని , మేడగుండా హ్యాండ్ బాగ్ వేలాడదీసింది. మౌని థైస్ వరకు వచ్చే ఎత్తైన నల్లని బూట్లను తన పాదాలకు వేసుకుంది. మౌని నిజంగా స్కూల్ గర్ల్ లా కనిపించి అందరిని అఆకట్టుకుంది.

రీసెంట్ గా తన ఇంట్లో క్యాజువల్ అవుట్ ఫిట్స్ తో దిగిన పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి కుర్రళ్ళ చూపును తనవైపుకు తిప్పుకుంది. డీప్ నెక్ లైన్ తో బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్ లో తన ఎద అందాలను చూపిస్తూ చలి కలంలోనే చెమటలు పట్టిస్తోంది. విభిన్న భంగిమల్లో దిగిన ఫోటో లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

క్యా జువల్ అవుట్ ఫిట్స్ అంటే మౌనికి ఎంతో ప్రేమ . ఎయిర్‌పోర్ట్ లుక్స్ నుండి రెగ్యులర్ బేసిక్స్ వరకు, మౌని తన క్యాజువల్ ఫిట్‌లను ధరించేందుకు ఇష్టపడుతుంది.

ఈమధ్యనే ఈ బ్యూటీ చిక్ క్రాప్ టాప్ , బ్లాక్ బాటమ్స్‌లో క్యాజువల్ లుక్ లో కనిపించి కైపెక్కించింది .ఈ క్లాసిక్ ఆవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యే నాట్టెడ్ గోల్డ్ టోన్డ్ నెక్ పీస్ ను మేడలో వేసుకుని మంత్రముగ్ధులను చేసింది.
