యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరియర్ ఆరంభంలో మూడు సాలిడ్ హిట్స్ వచ్చాయి. ఆ తరువాత అతను హీరోగా చేసిన ప్రతి సినిమా కూడా ఏవరేజ్ టాక్ లేదంటే డిజాస్టర్ అవుతూనే వచ్చాయి. అతని తర్వాత ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోలు ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతూ ఉంటే రాజ్ తరుణ్ మాత్రం ఒకే మూసలో కథలు ఎంపిక చేసుకుంటూ ఫ్లాప్ మీద ఫ్లాప్ కొట్టాడు. పోనీ కొత్తగా ట్రై చేసిన కంటెంట్ అయిన వర్క్ అవుట్ అయ్యిందా అంటే అది కూడా లేదు. దీంతో ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ గురించి చాలా మంది మరిచిపోయారు. యాక్టివ్ పెర్ఫార్మెన్స్ తో మంచి టాలెంటెడ్ యాక్టర్ అనే పేరు ఉన్న కూడా తనకి సరిపోయే కథలని మాత్రం ఎంపిక చేసుకోలేక రాజ్ తరుణ్ కెరియర్ ని డిస్టర్బ్ చేసుకున్నాడు.
ప్రస్తుతం చిన్న హీరోల సినిమాలు అద్భుతమైన మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే ఆడియన్స్ థియేటర్స్ కి చూడటానికి వెళ్తున్నారు. లేదంటే అస్సలు పట్టించుకోవడం లేదు. మంచు విష్ణు జిన్నాకి ప్రేక్షకుల నుంచి ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇక సినిమాలని ట్రై చేయకుండా ఈ సారి రాజ్ తరుణ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఆహా నా పెళ్ళంటా అనే వెబ్ సిరీస్ తో జీ5 ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ వెబ్ సిరీస్ ని దర్శకుడు సంజీవి రెడ్డి తెరకెక్కించారు.
యుట్యూబ్ లో కంటెంట్ బేస్ వెబ్ సిరీస్ లతో బాగా పాపులర్ అయినా తామడ మీడియా దీంతో ఓటీటీ మార్కెట్ లోకి అడుగుపెడుతుంది. భారీ బడ్జెట్ తోనే ఈ వెబ్ సిరీస్ ని వారు తెరకెక్కించారు. ఆమని, హర్షవర్ధన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ని ఈ వెబ్ సిరీస్ కోసం తీసుకున్నారు. ఇక శివాని రాజశేఖర్ ఈ వెబ్ సిరీస్ లో రాజ్ తరుణ్ కి జోడీగా నటించింది. ఇక నవంబర్ 17 నుంచి ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. మరో సినిమాలతో డిజాస్టర్ ఇమేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఈ వెబ్ సిరీస్ తో అయిన మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.