ప్రతి అమ్మాయి జీవితంలో ఏదో ఒక వయస్సులో, ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపులు అనేవి ఉంటాయి. అయితే కామన్ లైఫ్ జీవించే అమ్మాయిలు సమాజంలో ఇలాంటి వేధింపులు ఎదురైనా కూడా బయటకి చెప్పుకునే ప్రయత్నం చేయరు. కొంత మంది మాత్రం ధైర్యంగా తమకి ఎదురయ్యే వేధింపులని ఎదుర్కొంటారు. చట్టం సాయం తీసుకొని వేధించే వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాగే హీరోయిన్స్ కి కూడా లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి లైంగిక వేధింపులు ఎదురయ్యే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ గా పరిచయం అయ్యే ప్రతి అమ్మాయికి ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతలు, హీరోల నుంచి కమిట్మెంట్ అనే పేరుతో లైంగిక వేధింపులు ఎదురవుతాయి. అయితే అవకాశాల కోసం కొంత మంది భామలు ఆ కమిట్మెంట్ కి ఒకే అంటారు.
అయితే అలాంటివి మనకి సెట్ కావు అనుకున్న వారు మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ ని అందుకోలేరు. చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో తమకి ఎదురైన కాస్టింగ్ కౌచ్ సంఘటనలని బయటపెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా తమిళ్ హీరోయిన్ ఆండ్రియా కూడా తనకి ఎదురైన లైంగిక వేధింపుల ఘటన గురించి బయటకి చెప్పింది. చిన్న వయస్సులో నేను మా నాన్నతో కలిసి బస్సులో వెళ్తున్నప్పుడు ఎవరిదో చేయి వెనుక డ్రెస్సలోంచి నా వీపుని తాకింది. ఆ చెయ్యి అలా పైకి వెళ్ళింది. ముందు అది మా నాన్న చెయ్యి అనుకున్న.
పక్కకి చూస్తే నాన్న రెండు చేతులు ముందుకి పెట్టుకొని ఉన్నారు. తరువాత వెనుక కూర్చున్న వ్యక్తి నా వీపుపై చేయి వేసి లైంగిక ఆనందం పొందుతున్నాడు అని అర్ధమైంది. అయితే ఈ విషయాన్ని జీవితంలో ఇప్పటి వరకు నా తండ్రితో చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. మనం పెరిగిన వాతావరణం కారణంగా తండ్రితో ఇలాంటి ఘటనల గురించి ఆడపిల్లలు చెప్పుకునే ప్రయత్నం చేయలేదని నాకు అనిపిస్తుంది. ఇప్పటికి చాలా చోట్ల ఇలా ఆడపిల్లలపై చేతులు వేసి లైంగిక ఆనందం పొందేవారు సమాజంలో ఉన్నారని ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు చేసింది.