Esha Gupta : మోడల్, నటి , పర్యావరణవేత్త అయిన బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా అద్భుతమైన నటనతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఫ్యాషన్ రంగంలోనూ స్టైలిష్ లుక్స్ తో తనదైన ముద్ర వేసుకుంది. తన స్టైల్ అప్‌డేట్‌లతో, ఈషా 13 మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్‌లను ఆశ్చర్యపరుస్తుంటుంది.

ఈషా గుప్తా ఫాలోవర్‌లతో తన ఫ్యాషన్ జర్నల్ నుండి సారాంశాలను పంచుకుంటూ ఆనందిస్తుంది. ఎత్నిక్ వేర్ అయినా, ఆరు గజాల చీర అయినా, లేదా అద్భుతమైన గౌనులో అయినా రకరకాల లుక్స్‌లో కనిపిస్తూ ఈషా అదరగొడుతుంది.

Esha Gupta : ఈసారి, ఈషా జెన్నీ ప్యాక్‌మన్ రాక్‌ల ఫ్యాషన్ లేబుల్ నుంచి ప్లాటినం గ్రే గౌనును ఎంచుకుంది. త్రీక్వార్టర్ డ్రెప్డ్ స్లీవ్‌లు, సీక్విన్ డెకరేషన్‌తో కూడిన రౌండ్ నెక్‌లైన్ ఫ్లోర్-లాంగ్ గౌనులో తన గ్లామర్‌ని వెదజల్లుతూ మెస్మరైజ్ చేస్తోంది. టైట్ ఫిట్ డ్రెస్ లో ఆమె ఒంపులను హైలైట్ చేసింది. ఈషా తన దుస్తులకు మ్యాచింగ్ గా సిల్వర్ హీల్స్ , సున్నితమైన డైమండ్ స్టడ్ చెవిపోగులను ధరించింది.

రీసెంట్ గా ఓ ఫోటోషూట్ కోసం అద్భుతమైన లెహంగా సెట్ ను ధరించింది ఈషా గుప్తా. బ్రైట్ రెడ్ కలర్ లో ఉన్న ఈ లెహంగాలో అప్సర సలా మెరిసిపోయింది. డిజైనర్ బోర్డర్స్, డీప్ నెక్ లైన్ 3/4 స్లీవ్స్ కలిగిన బ్లౌజ్ వేసుకుని, దానికి మ్యాచింగ్ గా ఎంబ్రాయిడరీ తో వచ్చిన ఫ్రిల్డ్ స్కర్ట్ ధరించింది. సేమ్ ప్యాటర్న్ తో ఉన్న దుపట్టాను భుజాల మీదుగా వేసుకొని కెమెరాకు క్రేజీ లుక్స్ అందించింది.

ఈ అద్భుతమైన అవుట్ ఫిట్ ని రిధి మెహరా ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. మెడలో భారీ నెక్లెస్ చెవులకు దిద్దులను పెట్టుకొని అదరగొట్టింది.

ఫెస్టివల్ ఫ్యాషన్ ను ప్రమోట్ చేసేందుకు రిధి మెహరా రూపొందించిన అద్భుతమైన భారీ లెహంగా సెట్ వేసుకొని తన అందాలను పరిచింది ఈ ముద్దుగుమ్మ. వైట్ బ్యాక్ డ్రాప్ లో రెడ్ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ తో వచ్చిన ఈ లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్టుగానే జ్యువెలరీని ఎన్నుకొని కలర్ ఫుల్ లుక్స్ తో కవ్వించింది. ఈ పిక్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.
