Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్ కి సంబంధించి రెండో ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమో లో ముందుగా శ్రీహాన్ వాయిస్ తో స్టార్ట్ అవుతుంది. విన్నింగ్ ప్రైజ్ యాభై లక్షలు అని పెద్ద బోర్డు చూపించి ఏంటి బిగ్ బాస్ ఇది అని శ్రీహాన్ అంటాడు. పక్కన రేవంత్ కూడా ఉంటాడు. తర్వాత కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా బజర్ మోగుతుంది. దీంతో అందరూ వాహనం ఎక్కేందు పరిగెత్తి మరీ ప్రయత్నిస్తారు.ఈ క్రమలో రోహిత్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతాడు.
లారీ ఎక్కలేక పోయిన ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్ ఏకాభిప్రాయంతో శ్రీహాన్ ను ముందుకు తీసుకెళ్లాలి.. శ్రీసత్యను పక్కకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆదిరెడ్డి ప్రకటిస్తాడు. లాస్ట్ టైం కొన్ని మాటల వలన వదిలేసిన కీర్తి ఈసారి వదిలేయదని గ్యారెంటీ ఏంటని రేవంత్ అభిప్రాయపడతాడు. దీంతో మెరీనా గారు ముందుకు వెళ్తారు.. కీర్తిని తొలగిస్తున్నామని అని శ్రీహాన్ ప్రకటిస్తాడు.

దీంతో కీర్తి తనను తొలగించినందుకు రోహిత్ తో కూర్చోని బాధపడినట్లు తెలుస్తుంది. ఇక ఫైమా, శ్రీహాన్, రేవంత్ మధ్య జరిగిన సంభాషణను చూపిస్తారు. శ్రీహాన్, శ్రీసత్య వీరిద్దరు ఎట్లాగూ మాట్లాడుకుంటారు.. మనం ఎలాగూ ఆటలో అరటిపండ్లు అయిపోయాము వీరి ఉద్దేశ్యంలో అని చెప్పేసి అని రేవంత్ ఏదో చెప్పబోతాడు. దీంతో ఆటలో అరటిపండు చేసేయడం అంటే ఏదో కావాలనే నేను చేసినట్లు వస్తుంది రా అని రేవంత్ పైన శ్రీహాన్ సీరియస్ అవుతాడు.
ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నట్లు జనాలకు ఏదో అభిప్రాయం కలిగేలా చేస్తున్నావ్ నీవు అని శ్రీహాన్ అంటాడు. ఇప్పుడు ఏంటి నేను శ్రీహాన్ ఎక్కువ మాట్లాడకూడదు అంతేనా..వెళ్లి ఒక పది మందికి చెప్తున్నావ్ అని శ్రీసత్య కూడా రేవంత్ మీద కాస్త అరుస్తుంది. ఇంకోసారి రాంగ్ గా అంటే బావుండదు.. మీరు చెప్పిందే కరెక్ట్ కాదు… ఓ సారి పక్కవాళ్లు చెప్పేది కూడా వినాలి అనుకుంటూ రేవంత్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. వాడిని మేమేదో కార్నర్ చేసినట్లు రేవంత్ క్రియేట్ చేస్తున్నాడు.. ఎందుకు చేస్తున్నాడో అర్ధం కావట్లేదని శ్రీహాన్ తన అనుమానాన్ని ఫైమా, శ్రీసత్యతో వ్యక్తం చేస్తాడు. ఈ క్రమంలో ప్రోమో మగుస్తుంది. అసలు ఏం జరిగింది అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే..!