Anger management: ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి వ్యక్తిత్వంలో అనేక తేడాలుంటాయి. కొందరు శాంతంగా ఉంటే.. మరికొందరికి చిన్న విషయాలకే కోపం వస్తూ ఉంటుంది. దీనికి అతని కుటుంబ నేపథ్యం, వైఖరితో పాటు వాస్తు కూడా ప్రభావం చూపిస్తుందట. ప్రసిద్ధ మానసిక వైద్యుడు, వాస్తు నిపుణుడు డాక్టర్ మధు కొటియా.. వాస్తును ఉపయోగించి కోపాన్ని ఎలా నియంత్రించాలనే దానిపై కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఇంట్లో ఎరుపు రంగు వద్దు
ఎరుపు రంగుకు, కోపానికి సంబంధం ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది. వీలైనంత వరకు గోడలు, గృహోపకరణాలపై ఎరుపు రంగు లేకుండా ఉండేలా చూసుకోవాలి. దీనికి బదులుగా నీలి రంగు, లేత ఆకురంగులను వేయాలి.
మంచం, బెడ్ దగ్గర క్వార్ట్జ్ క్రిస్టల్‌ను ఉంచాలి. ఇది కోపాన్ని గ్రహిస్తుంది. మానసిక ప్రశాంతత, ఓర్పు, సహనాన్ని ఇస్తుంది. ఈ స్ఫటికాలను ఉపయోగించి శాంతియుత వాతావరణాన్ని సృష్టించవచ్చు. ఇవి కోపాన్ని నియంత్రిస్తాయి.
Anger management:
ఇంట్లో వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మీ ఇంటిలో సరైన ప్లేస్‌లో అద్దం ఏర్పాటు చేస్తే.. కోపాన్ని తొలగించడంలో సహాయపడుతంది. ముఖ్యమైన ఫర్నీచర్ పెట్టే ప్లేసుల్లో మురికి లేకుండా చూసుకోవాలి. వీటన్నిటి వల్ల కోపం అదుపులో ఉంటుందట.