దీపని రెండు, మూడు సార్లు చంపడానికి మోనిత ప్రయత్నించిందనే విషయం తెలిసి కోపంతో ఊగిపోతాడు కార్తీక్. వెంటనే వెళ్లి మోనితని చెడామడా తిట్టేస్తాడు. కానీ మోనిత మాత్రం రివర్స్‌లో కార్తీక్‌నే భార్య అయినా తనకి కాకుండా దీపకి సపోర్టు చేస్తున్నందుకు తిడుతుంది. ఆ తర్వాత నవంబర్ 16న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘నువ్వు నిజంగా నా భార్యవేనా మోనిత. అదే నిజమైతే దీపని ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నావు. తను నా భార్య కాబట్టి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావా’ అని నిలదీస్తాడు కార్తీక్. దానికి.. ‘నేనే నిజమైన భార్య. నువ్వు తనతో తిరుగుతున్నావానే అలా ప్రవర్తించాను’ అని బాధగా అంటుంది మోనిత. అది చూసి.. ఏం నటిస్తున్నావని మనసులో అనుకుంటాడు కార్తీక్. ఇంకోవైపు.. దీప దగ్గరకి దుర్గ వస్తాడు. కార్తీక్ సర్‌కి గుర్తొచ్చిందేమోనని అనిపిస్తోందని దీపకి చెబుతాడు దుర్గ. వరుసగా కార్తీక్ చేస్తున్న పనుల వల్ల అతనికి గతం గుర్తొచ్చిందని అనుకుంటారు దీప, దుర్గ. మోనితని భార్య అనుకోట్లేదని, తనని భార్య అనుకుంటున్నాడని చెబుతుంది దీప. కానీ.. గతం గుర్తొచ్చిన ఎందుకు మోనిత దగ్గరే ఉంటున్నాడని, ఏదో పెద్ద కారణం ఉండి ఉండొచ్చని అనుకుంటారు దుర్గ, దీప.
ఇంకోవైపు.. ఇంద్రుడు పాత ఊరిలో ఓ షాపు వాడు ఇవ్వాల్సిన డబ్బు కోసం వెళుతుంటాడు. తను కూడా వస్తానని మారాం చేస్తుంది సౌర్య. అది విని.. ‘మీ అమ్మనాన్న చూసేస్తారు’ అని నోరు జారి అంటాడు ఇంద్రుడు. అది విని.. సౌర్య, చంద్రమ్మ వేరు వేరు కారణాలతో షాక్ అవుతారు. ఇంతలో తేరుకున్న ఇంద్రుడు.. ‘మీ నాన్నమ్మ, తాతయ్య చూసే అవకాశం ఉంది’ అని కవర్ చేస్తాడు ఇంద్రుడు. అనంతరం సౌర్య బలవంతం చేయడంతో ఇంద్రుడు, చంద్రమ్మ, సౌర్య కలిసి ఇంతకుముందు ఉన్న ఊరికి బయలుదేరతారు.
మరోవైపు.. దీప దగ్గరకి వస్తుంది మోనిత. ‘నీకు పొగరు బాగా ఎక్కువైపోయింది. అందుకే నీ ప్రాణాలు తీయబోతున్నాను’ అని వెటకారంగా అంటుంది మోనిత. దానికి.. ఏం చేయలేవన్నట్లు మాట్లాడుతుంది దీప. కానీ.. కార్తీక్‌ని వదిలి వెళ్లిపోకపోతే చంపేస్తానని బెదిరిస్తుంది మోనిత. దానికి.. డాక్టర్ బాబు కోసం ఏదైనా చేస్తానని అంటుంది దీప. దాంతో.. గంటలు లెక్కపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది మోనిత. దీపతో గొడవ పడి సరాసరి హోటల్‌కి వెళుతుంది మోనిత. దీప, కార్తీక్ గురించి ఆలోచిస్తూ హోటల్‌లోని ఐటమ్స్ అన్నింటిని కోపంగా తీనేస్తుంటుంది మోనిత. అది చూసి అక్కడి వాళ్లు ఆశ్చర్యపోతుంటారు. మరోవైపు.. మోనిత మాటలను తలచుకుని బాధ పడుతుంటుంది దీప. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్.. ఏం జరిగిందని అడుగుతాడు కార్తీక్. దాంతో.. జరిగిన విషయాన్ని చెప్పి కోపంతో ఊగిపోతుంటుంది దీప. మోనితతో తేల్చుకోడానికి వెళ్లబోతుంటుంది. అది చూసి కార్తీక్ ఆపడానికి ప్రయత్నిస్తున్న వినకుండా వెళుతుంది.
ఇంకోవైపు.. ఫుడ్ తిన్న మోనిత బిల్ తీసుకురమ్మని బేరర్‌ని అడుగుతుంది. అది విని.. ఆమె కట్టేసిందని సౌందర్యని చూపిస్తాడు బేరర్. సౌందర్యని చూసి షాక్ అవుతుంది మోనిత. ఇంతలో దగ్గరకి వచ్చిన సౌందర్య.. ‘ఎందుకు అంత తిన్నావు. కోపంలో ఉన్నావా’ అని మోనితని అడుగుతుంది. కార్తీక్, ఆనంద్ లేరనే బాధలో అలా తిన్నానని బుకాయించే ప్రయత్నం చేస్తుంది మోనిత. దాంతో.. ఇంటికి వెళదామని అంటుంది సౌందర్య. వద్దని హోటల్‌కి వెళదామని మోనిత కంగారుగా చెబుతుంది. అది గమనించి.. ‘అక్కడ ఏదైనా దాస్తున్నావా.. మొన్న అంకుల్ వచ్చినప్పుడు కూడా అలాగే ప్రవర్తించావంటా’ కదా అంటుంది సౌందర్య. అయినా బోటిక్ నిండా బట్టలున్నాయని తనని రాకుండా ఆపాలని అనుకుంటుంది మోనిత. కానీ అదంతా వినని సౌందర్య ఇంటికి వెళదామంటుంది.
అలాగే.. సౌర్య, ఇంద్రుడు, చంద్రమ్మ కలిసి ఆటోలో పాత ఊరికి వస్తారు. ఆ ఊరిని చూసి అనవసరంగా ఈ ఊరిని వదిలేసి వెళ్లిపోయామని అంటుంది సౌర్య. అది విని.. నువ్వు ఓకే మళ్లీ ఇక్కడికే వద్దామని అంటాడు ఇంద్రుడు. కానీ.. తాతయ్య బలవంతంగా లాక్కెళ్లడానికి ప్రయత్నించిన విషయం గుర్తొచ్చి వద్దని అంటుంది సౌర్య. సౌర్య, సౌందర్య ఒకరిని ఒకరు చూసుకున్నారో లేదో తరువాతి ఎపిసోడ్‌లో చూడండి.