స్టార్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న యాక్టర్ రష్మి గౌతమ్. ఈ బ్యూటీ కెరియర్ ని నటిగా ఆరంభించిన తర్వాత జబర్దస్త్ షోతో యాంకర్ అవతారం ఎత్తింది. ఇక అక్కడ తన గ్లామర్ షోతో జబర్దస్త్ కి కలరింగ్ తీసుకొస్తూ బాగానే ఫేమస్ అయ్యింది. ఇక ఈ జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో మరింతగా రష్మికి హైప్ వచ్చింది. వీరిద్దరి జోడీ బాగుందనే కితాబు రావడంతో చాలా షోలు కలిసి చేశారు. అయితే సుడిగాలి సుధీర్ తో ఆన్ స్క్రీన్ వరకు మాత్రమే తామిద్దరి బంధం ఉంటుందని, ఆఫ్ స్క్రీన్ లో మాత్రం కేవలం కో స్టార్స్ మాత్రమే అని చెప్పింది. అంతకు మించి తామిద్దరి మధ్య గొప్ప అనుబంధం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది.
అయితే సుధీర్ తో మంచి ఫ్రెండ్ షిప్ మాత్రం ఉందని చెప్పింది. స్క్రీన్ పై మా ఇద్దరిని మా ఫ్యాన్స్ కలిసి చూడటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి వారిని సంతోష పెట్టడం కోసం రొమాంటిక్ గా నటిస్తున్నామని చెప్పేసింది. ఇదిలా ఉంటే తాజాగా రష్మి యాంకర్ గా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. సినిమా ట్రైల్స్ లో ఉంది.
ఇక ఈ బ్యూటీ హాలిడే ట్రిప్ కి కాస్తా సేదతీరడానికి వెళ్ళింది. మాల్దీవులలో ఈ అమ్మడు ఎంజాయ్ చేస్తుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇందులో ఓ ఫోటోలో లవ్ సింబల్ తరహాలో చేతులు పెట్టి చూపించింది. దీంతో రష్మి ఎవరితో ప్రేమలో పడిందనే ప్రచారం తెరపైకి వచ్చింది. అదే విషయాన్ని ఇలా ఫోటోల ద్వారా వ్యక్తం చేస్తుందని కన్ఫర్మ్ చేస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది ఆమె క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.