Chanakya: భారతదేశం ఎంతో మంది నిపుణులకి పుట్టినిల్లు. ఆర్యభట్ట జీరో కనిపెట్టకపోతే గణితం ప్రస్తుతం ఉన్న స్థాయిలో ఉండేది కాదు. అసలు జీరో లేకపోతే గణితమే లేదు. భారతదేశం నుంచి వచ్చిన మరొక ఆణిముత్యం చాణక్యుడు. ఆయన చెప్పిన సూత్రాలు రాయకీయంగానే కాదు మన నిజజీవితంలో కూడా ఉపయోగపడతాయి. ఆయన రచించిన చాణక్య నీతి శాస్త్రం ఒక జ్ఞాన భాండారం. చాణక్యుడిని జీవిత కోచ్ అని కూడా అంటారు.
భార్యాభర్తల సంబంధం బలంగా ఉండటానికి చాణక్యుడు సిద్దాంతం..
అపర చాణక్యుడు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. రాజకీయ సలహాలు మాత్రమే కాకూండా జీవిత సత్యాలు కూడా ఎన్నో చెప్పాడు. భార్యాభర్తల మధ్య బంధాల గురించి అది దృఢంగా ఉండాలంటే కావాల్సిన సూత్రాలు గురించిన చెప్పాడు. ఈ నాలుగు సూత్రాలు ఉంటే దంపతుల మధ్య బంధం దృఢంగా ఉంటుంది.
ప్రేమ,అంకిత భావం,ఒకరిని ఒకరు గౌరవించుకోవడం,స్వార్థం ఉండకపోవడం ఈ నాలుగు సూత్రాలు అవసరం. ఏ బంధానికైనా ప్రేమ అవసరం అది లేకపోతే ఏ బంధం కూడా నిలబడలేదు. భార్యాభర్తల బంధం దీనికి అతీతం కాదు. దంపతులకి ఒకరిమీద ఒకరు ప్రేమ ఉండాలి. ఒకరు ప్రేమ చూపించి ఇంకొకరు ప్రేమ చూపించకపోతే కూడా బంధం నిలబడదు.
Chanakya:
భార్యా మీద భర్తకి,భర్త పట్ల భార్యకి అకింత భావం ఉండాలి. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టు కాకుండా అంకిత భావం ఉండాలి. దంపతులు ఒకరినొకరు గౌరవించుకోవాలి. నేను ఎక్కువ నువ్వు తక్కువ అన్న సూత్రం ఇక్కడ పనికిరాదు. అలా చేస్తే ఉన్న బంధం బీట్లు వారుతుంది. స్వార్థం ఇది చాలా చెడ్డది. భార్యాభర్తల విషయంలో ఇది ఇంకా చాలా ప్రమాదం. దంపతులు వారి గురించి మాత్రమే కాదు ఇద్దరి గురించి ఆలోచించాలి. ఇద్దరి గురించి ఆలోచిస్తే బంధం బలపడుతుంది ఇద్దరూ సంతోషంగా కూడా ఉంటారు. దంపతులు చాణుక్యుడు చెప్పిన సూత్రాలు పాటిస్తే సరిపోతుంది.