Digestion: ప్రతి ఒక్కరికీ తిండి తినడం ఎంత ముఖ్యమో దాని అరుగుదల కూడా అంతే ముఖ్యం. జీర్ణం కావడంలో సమస్య ఉంటే ఎంత తిన్నా ప్రయోజనం ఉండదు. శరీరం పోషకాలను గ్రహించదు. దీంతో తిన్నదంతా కడుపులోనే ఉండిపోయి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. చర్మ సమస్యలు, జుట్టు రాలడం, ఊబకాయం, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం అతి ముఖ్యం. ఇందుకోసం ఆయుర్వేద నిపుణులు కొన్ని చిట్కాలను చెబుతున్నారు. అవి మీకోసం..
అన్ని రుచులతో రోజువారీ భోజనం..
ఆయుర్వేదం ప్రకారం, మీరు తినే భోజనంలో తీపి, పులుపు, లవణం, ఘాటు, చేదు, వగరు వంటి 6 రుచులను ఉండేలా చూసుకోవాలి. ఇలా వైవిధ్యమైన రుచులు కలిగిన ఆహారంను శరీరం సులభంగా జీర్ణం చేయగలదు. ఆహారంలో నిమ్మకాయ రసం, లేదా మిరియాలు, జీలకర్రను భాగం చేసుకోండి.
హెర్బల్ టీలు
చాలా మంది భోజనానికి, భోజనానికి మధ్య కూడా అనేక చిరుతిళ్లు తింటూ ఉంటారు. దీనివల్ల అనేక సమస్యలొస్తాయి. అందువల్ల మధ్యలో హెర్బల్ టీలు తాగాలి. కొత్తిమీర టీ, జీలకర్ర టీ, ఫెన్నెల్ టీలు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, చిరుతిండి తినాలనే కోరికలు తగ్గుతాయి. శరీరం నుంచి మలినాలు తొలగిపోతాయి.
లంచ్‌టైమ్‌లో ఎక్కువ తినండి.. రాత్రి తగ్గించండి..
రోజులో ఎక్కువ ఆహారాన్ని మధ్యాహ్న సమయంలో తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతుంది. ఈటైంలో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అలాగే నిద్రవేళకు 3 గంటల ముందే రాత్రి భోజనం తక్కువ మోతాదులో తినేయాలి. తిన్న వెంటనే పడుకోవద్దు. నిద్రలో ఉన్నప్పుడు శరీరం ఇతర మరమ్మత్తులు చేసుకుంటుంది. మానసిక ఒత్తిళ్లు, ఆలోచనలు, భావోద్వేగాలను జీర్ణం చేసి విశ్రాంతిని కల్పిస్తుంది.
Digestion:
వీటితోపాటు ఏంతిన్నా మితంగా తినడం అతి ముఖ్యం. రుచిగా ఉందని అధికంగా తినడం, టేస్ట్ లేదని అతి తక్కువ తినడం మంచిదికాదు. అలాగే వేగంగా కాకుండా కాస్త నిదానంగా ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. వీటన్నిటిని పాటిస్తే చాలా వరకు జీర్ణ సమస్యలను దూరం పెట్టొచ్చు.