Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ నందుకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఏం చేద్దామని అనుకోని వెళ్ళాను.. కానీ ఏం చేశాను అని.. సమస్యలను పరిష్కరిద్దాము అనుకుంటే మరింత సృష్టించాను అని బాధపడతాడు. ఇక తులసికి జరిగిన విషయం మొత్తం చెప్పాలి అని అనుకుంటాడు.
మరోవైపు తులసి జరిగిన విషయం తెలుసుకొని ఇంటికి ఒంటరిగా రావటంతో తనను ప్రేమ్ ఫాలో అవుతాడు. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత తులసి ప్రేమ్ ను ఒంటరిగా వదిలేయ్ అని అంటుంది. ఇక నందు మాత్రం చాలా గిల్టీగా ఫీల్ అవుతూ తులసి గురించి ఆలోచిస్తాడు. నందు మీద ఎందుకు అలా అరిచాను అని.. చాలా గట్టిగా ఉంది అంటూ.. ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని ఉంది అని అనుకుంటాడు.
మరోవైపు తులసి తో ప్రేమ్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక నేను చెప్పే మాటలు విను అంటూ.. సామ్రాట్ గారి మీద నెగటివ్ థింకింగ్ పెంచుకోవద్దు అని అంటాడు. అయినా దిగజారి మాట్లాడలేదు నీకు సపోర్టుగా మాట్లాడాడు అని అంటాడు. మేము అడగాల్సినవన్నీ ఆయనే అడిగాడు.. ఆయన మాట్లాడిన మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టి సైలెంట్ అయ్యారు అని అంటాడు.
ఇక తులసి మాత్రం ఆయన నా విషయంలో అంతగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు అని అనటంతో.. సమయంలో నీకు తోడు ఎవరు లేరని ఆయన నీ గురించి ఆలోచించాడు అని ప్రేమ్ అంటాడు. తొందరపడి ఆయనతో స్నేహాన్ని వదులుకోకు అని.. స్నేహానికి మంచి విలువ ఇస్తున్నాడు అని సామ్రాట్ గురించి గొప్పగా చెబుతాడు ప్రేమ్. అంతేకాకుండా కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాడు.
ఇక సామ్రాట్ ఇంటికి వెళ్లి బాధపడుతూ ఉండగా తన బాబాయ్ అక్కడికి వచ్చి మాట్లాడుతాడు. ఇక సామ్రాట్ కూడా తన బాబాయ్ తో స్నేహాన్ని దాటి ప్రవర్తించాను అని.. తులసి గారు ఏమనుకుంటున్నారో అంటూ తనకు వెంటనే క్షమాపణలు చెప్పాలి అని అంటాడు. ఇక నన్ను అసహ్యించుకుంటుందేమో అని అనడంతో.. వెంటనే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అలా ఎప్పటికీ జరగదు అని మాట్లాడుతాడు.
Intinti Gruhalakshmi:
ఇక ఇంట్లో నందు కాస్త చిరాకుగా కనిపిస్తాడు. అప్పుడే అక్కడికి లాస్య వచ్చి మాట్లాడుతుంటే నందు చిరాకు పడతాడు. సామ్రాట్ మన జోలికి రాడు అని మాట్లాడుతుంది. అంతేకాకుండా కాస్త వెటకారంగా మాట్లాడటంతో నందు కి బాగా కోపం వస్తుంది. అక్కడి నుంచి నందు వెళ్తుండగా నీతోనే మాట్లాడుతున్నాను అని లాస్య అంటుంది. ఇక నందు మాత్రం.. నాకు నీతో మాట్లాడే ఓపిక లేదు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు.