బాహుబలి సినిమాలో ఐటెం సాంగ్స్ లో నర్తించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ నోరా ఫతేహి గురించి అంత ఈజీగా మరిచిపోలేం. ఆ సాంగ్ లో ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ కూడా ఐటెం క్వీన్ గా నోరా ఫతేహి రాణిస్తుంది. అలాగే అడపాదడపా సినిమాలలో కూడా హీరోయిన్ గా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ఈ భామకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ భామ చాలా గ్యాప్ తర్వాత మరల తెలుగు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ సారి ఆమె కనిపించబోయేది ఐటెం గర్ల్ గా మాత్రం కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. అయితే మహేష్ బాబు తల్లి మరణంతో సెకండ్ షెడ్యూల్ వాయిదా పడింది. తరువాత పూజా హెగ్డే గాయం కారణంగా ప్రస్తుతం మళ్ళీ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అతని పరిస్థితి ఎప్పటికి ఎలా ఉంటుందో చెప్పలేని కండిషన్.
ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ మళ్ళీ రెండు, మూడు నెలల పాటు ఈ సినిమా వాయిదా వేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి విలన్ గా త్రివిక్రమ్ ఈ సారి ఫీమేల్ లీడ్ ని దించుతున్నట్లు తెలుస్తుంది. ఆ పాత్ర కోసం బాహుబలి ఐటెం క్వీన్ నోరా ఫతేహిని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. కాస్తా డిఫరెంట్ గా హైఫైలో ఆమె పాత్ర ఈ మూవీలో ఉంటుందనే మాట వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే త్రివిక్రమ్ టీం అఫీషియల్ గా స్పందించే వరకు వేచి చూడాలి.