Love Marriage Divorce ప్రేమ.. పెళ్లి.. ఒక కొత్త జీవితం.. మొదట్లో చాలా బాగుంటుంది. కొందరు కలకాలం ఆ అనుబంధాన్ని అలాగే కొనసాగిస్తారు. మరికొందరి జీవితాల్లో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది. మధ్యలోనే అనుమానాలు, అపోహలకు దారిస్తే, ఆ బంధం విడాకులకు దారితీస్తుంది. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. అయితే అంతలా ప్రేమించుకుని ఒక్కటైన జంట విడాకులకు ఎందుకు దారితీస్తుంది. దానికి కారణాలేంటి..?
నిబద్ధత లోపం: సాధారణంగా ప్రేమలో ఉన్నప్పుడు తప్పులు, మనస్పర్థలు వస్తే సర్దుకుపోతాం. పెళ్ళికి తర్వాత కూడా ఆ నిబద్దత ఉండాలి.
అహంకారం: పెళ్లి అయిన తర్వాత ఏ విషయంలోనూ అహంకారం పనికిరాదు. ఇద్దరు కూడా అహంకారాన్ని దరి చేరనీయకూడదు. పరస్పరం గౌరవించుకోవాలి.
అనుమానం: పరస్పర నమ్మకం లేకపోతే ఆ బంధం విడాకులకు దారి తీయవచ్చు. కావున అనుమానం అస్సలు వద్దు.
కుటుంబాన్ని లెక్కచేయకపోవడం: ఇద్దరు ఒకరి కుటుంబాన్ని.. ఒకరి సైడ్ బంధువులను మరొకరు గౌరవించుకోవాలి. లేకపోతే ఆ బంధం నిలబడదు.
అభిప్రాయ భేదాలు: ఇక ప్రేమ లో ఉన్నపుడు, పెళ్లి తర్వాత అందరిలో ఎక్కువగా కనిపించేవి అభిప్రాయ బేధాలు. వీటి వల్లే బంధం ఎక్కువ కాలం నిలబడదు. కావున అభిప్రాయ బేధాలు రానివ్వకండి.
ప్రేమలో ఉన్నపుడు బ్రేకప్ చెప్పుకుంటే అది ఇద్దరి మధ్య బంధాన్ని తెంపేస్తుంది. కొన్ని రోజులు ఇద్దరు బాధపడి మళ్ళీ మాములుగా ఉండవచ్చు. కానీ పెళ్లి తర్వాత విడాకులు తీసుకోవడం వల్ల ఇద్దరి వైపు చాలా సమస్యలు ఎదురవుతాయి. అందుకే మీరు రిలేషన్ నుండి పెళ్ళికి స్టెప్ వేసేముందు కొంచెం జాగ్రత్తగా అలోచించి.. తగిన నిర్ణయం తీసుకోండి.
Love Marriage Divorce
ఇక ఒక్కసారి ఫిక్స్ అయిపోయి.. పెళ్లి వరకు వచ్చిన మీ బంధాన్ని కలకాలం సంతోషంగా కొనసాగించాలంటే మాత్రం.. కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ముఖ్యంగా ప్రేమలో ఉన్నపుడు ఉన్న అనుబంధాన్ని.. పెళ్లి తర్వాత కూడా కొనసాగించాలి. చిన్న చిన్న విషయాలకు సర్దుకుపోవడం అలవర్చుకోవాలి.